హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UK Virus Memes: కొత్త కరోనాపై ఫన్నీ మీమ్స్.. కష్టాల్లోనూ కామెడీతో ఉపశమనం

UK Virus Memes: కొత్త కరోనాపై ఫన్నీ మీమ్స్.. కష్టాల్లోనూ కామెడీతో ఉపశమనం

Corona Mutation Memes: బ్రిటన్‌ సహా చాలా దేశాల్లో వ్యాపించిన కొత్త రూపాంతర (Mutated) కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మీరూ చూడండి.

Corona Mutation Memes: బ్రిటన్‌ సహా చాలా దేశాల్లో వ్యాపించిన కొత్త రూపాంతర (Mutated) కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మీరూ చూడండి.

Corona Mutation Memes: బ్రిటన్‌ సహా చాలా దేశాల్లో వ్యాపించిన కొత్త రూపాంతర (Mutated) కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మీరూ చూడండి.

Britain New Corona Virus: ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ (Coronavirus ) మహమ్మారి ఇప్పట్లో విరగడయ్యే అవకాశం లేదని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇది రూపం మార్చుకుని మరింత ప్రమాదకరంగా పరిణమించిందని, ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో వచ్చిన కరోనా వైరస్‌తో పోల్చితే తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom)లో కనుక్కున్న ఈ కొత్త రకం వైరస్ 70 శాతం అధికంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో కరోనా ముప్పు త్వరలోనే తొలిగిపోతుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ... రూపం మార్చుకొని మరోసారి విజృంభిస్తోందన్న వార్తలు అందర్నీ కలవర పెడుతున్నాయి. వారం నుంచి బ్రిటన్‌లో వైరస్ మ్యుటేషన్‌పై వార్తలు వస్తుండటంతో బ్రిటన్ నుంచి వచ్చే అన్ని ప్రయాణికుల విమానాలనూ గత అర్థరాత్రి నుంచి నిలిపివేసింది భారత ప్రభుత్వం. కాగా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మ్యుటేషన్(Mutation )పై ఈ వార్త వచ్చింది. దీంతో రాబోయే కొత్త సంవత్సరంలో కూడా కరోనా మనల్ని వదిలేలా లేదని... ఫన్నీ మీమ్స్(Memes )ను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

కొత్త రకం కరోనా వైరస్‌పై ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. "# కొత్త రకం కరోనావైరస్ బ్రిటన్ ప్రజలకు ఈ క్రిస్మస్‌కు కన్నీళ్లతో బహుమతులు ఇస్తుంది." అని అన్నాడు. మరొక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. 2020లో కరోనా రూపంలో వచ్చిన కష్టాలు అంతం అవుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్న తరుణంలో కరోనావైరస్ రూపం మార్చుకొని కొత్త సంవత్సరంలో అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ఎలా ప్లాన్ చేసిందో చూడండి.. అని తెలిపాడు. దీంతో పాటు కరోనా వైరస్ మ్యుటేషన్ వార్తలను వివరించడానికి నెటిజన్లు పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ (Mirzapur), గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (Gangs of Wasseypur)తో మీమ్స్‌ను రూపొందించారు.


ఒక నెటిజన్ ‘‘కొత్త రకం కరోనా వైరస్ వార్త వైరస్‌తో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే కొత్త మార్గం.’’ అని ఫన్నీ మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేశాడు.

మరో నెటిజన్ మాత్రం వ్యాక్సిన్‌ను రూపొందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ కొత్త రకం కరోనా విజృంభణపై గందరగోళాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఫన్నీ మీమ్ క్రియేట్ చేశాడు.

మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ ‘‘ప్రజలు ఎదురుచూస్తున్న మ్యూటేషన్, ఆస్ట్రేలియాలో నిర్థారణ అయిన మ్యూటేషన్ రెండింటినీ పోలుస్తూ ఫన్నీ మీమ్ రూపొందించాడు.

ఇది కూడా చదవండి:Tirumala Snake: తిరుమలలో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు

ఇదిలా ఉంటే కొత్త రకం కరోనా కేసులు బయటపడుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం క్రిస్మస్ వారంలో కఠినమైన లాక్డౌన్ చర్యలను అమలు చేస్తోంది. భారత్‌ సహా అనేక యూరోపియన్ దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలకు ప్రయాణ నిషేధాన్ని కూడా విధించాయి.

Published by:Krishna Kumar N
First published:

Tags: Coronavirus, Covid-19, UK Virus