హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UK virus in America: అమెరికాలో కొత్త రకం కరోనా వైరస్... అక్కడికీ పాకేసింది

UK virus in America: అమెరికాలో కొత్త రకం కరోనా వైరస్... అక్కడికీ పాకేసింది

అమెరికాలో కొత్త రకం కరోనా వైరస్...(ప్రతీకాత్మక చిత్రం - credit - twitter - reuters)

అమెరికాలో కొత్త రకం కరోనా వైరస్...(ప్రతీకాత్మక చిత్రం - credit - twitter - reuters)

America New Coronavirus: కొత్త సంవత్సరం చేదు వార్తలతో మొదలవుతోంది. నిన్న ఇండియాలో బయటపడిన కొత్త కరోనా వైరస్... ఇప్పుడు అమెరికాలో వెలుగులోకి వచ్చింది.

  New Coronavirus in America: ఒకప్పుడు ఇండియాలో కరోనా వస్తే డేంజర్ అనేవారు... ఇప్పుడు అమెరికాలో వస్తే డేంజర్ అంటున్నాం. అనడమే కాదు... అదే జరుగుతోంది. ఇప్పటికే ఉన్న కరోనాతో అమెరికాలో రోజూ లక్షన్నర దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బ్రిటన్ కొత్త కరోనా అమెరికాలో కనిపించడంతో కలవరం మరింత పెరిగింది. కొలరాడోలో ఓ వ్యక్తిలో ఈ కొత్త కరోనా వైరస్‌ని గుర్తించారు. మనకు తెలుసు... ఈ కొత్త వైరస్, పాత దానికంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని. ఆ లెక్కన చూస్తే... అమెరికాలో కొత్త దాని వల్ల రోజుకు 2 లక్షల నుంచి 2న్నర లక్షల దాకా కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ వ్యక్తిలో కనిపించిన స్ట్రెయిన్ (Strain)... ఇప్పటివరకూ కనిపించిన వాటికంటే చాలా వేగవంతమైనది అని డాక్టర్లు తెలిపారు.

  అమెరికాలో కొత్త కరోనా వైరస్ రావడం ఇదే తొలిసారి. 20 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తిని ఎల్బెర్ట్ కౌంటీలో ఒంటరిగా ఉంచారు. అతనికి ట్రావెల్ హిస్టరీ లేదు. అంటే అతను బ్రిటన్‌కి వెళ్లలేదు. అయినా సరే సోకింది. అందుకే ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వల్ల అతనికి ఇది సోకిందేమో పరిశీలిస్తున్నారు. అదే నిజమైతే... అమెరికాలోని ఇంకెవరిలోనో కూడా ఇదే వైరస్ ఉండి ఉన్నట్లే.

  అదొక్కటే ఊరట:

  ఈ కొత్త వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి... దీని వల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయేమో అనే డౌట్ మనకు ఉంటుంది. డాక్టర్లు ఏమంటున్నారంటే... ఇప్పటివరకూ అలా జరగట్లేదనీ... మరణాల రేటు కొత్త కేసులకు తగ్గట్టుగానే, ఎప్పటిలాగే ఉంటోందని చెబుతున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.

  ఇండియాలో ఇప్పటికే 20 మందికి ఈ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి మనం అందరం జాగ్రత్తలు పాటిస్తున్నాం. భారత్ బయోటెక్ కంపెనీ... తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్... కొత్త కరోనాను కూడా ఎదుర్కోగలదని చెబుతోంది. అలా జరిగితే మంచిదే. సమస్యేంటంటే... వ్యాప్తి పెరిగితే... ఇదివరకు వంద మందికి సోకితే... ఇప్పుడు 170 మందికి సోకే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎక్కువ పేషెంట్లు, ఎక్కువ వైద్య పరికరాలు, ఎక్కువ బెడ్లు, ఎక్కువ డాక్టర్లు అవసరం. ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది.

  ఇది కూడా చదవండి:Gold Prices Today: తగ్గిన బంగారం, వెండి ధరలు. నేటి రేట్లు ఇవీ

  ఇప్పటికే చాలా దేశాలు బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను ఆపేశాయి. అయినా కొత్త వైరస్ రోజుకో దేశానికి వెళ్తూనే ఉంది. ఇది త్వరగా పోవాలనీ, కొత్త ఏడాదిలో ఈ సమస్య ఉండకూడదని అంతా కోరుకుంటున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: UK Virus

  ఉత్తమ కథలు