రష్యా(Russia) దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అడ్వాన్స్డ్ ఆర్మర్డ్(Advanced Armed) లాంచర్స్ యూకే(United Kingdom) పంపుతోంది . తూర్పు ఉక్రెయిన్‌లోని(Ukraine) డాన్బాస్ ప్రాంతంలో రష్యా పూర్తి స్థాయి దాడులను ప్రారంభించినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. రష్యా వైమానిక దాడులను నిర్వీర్యం చేయడానికి ఉక్రెయిన్ దళాలకు యూకే స్టార్మర్ ఆర్మర్డ్ మిసైల్ లాంచర్ ఉపయోగపడనున్నాయి. ఈ వ్యవస్థ ఉక్రెయిన్(Ukraine) దళాలకు వైమానిక లక్ష్యాలను చేధించడానికి అదనపు సామర్థ్యాన్ని ఇస్తుందని విశ్లేషకుల భావన. స్టార్మర్(Smarter) మిసైల్(Missile) లాంచర్ నుంచి ప్రయోగించే స్టార్‌స్ట్రీక్ మిసైల్స్‌కు తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను నాశనం చేయగల శక్తి ఉంది. మరిన్ని ఆయుధాల కోసం పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరిన తర్వాత పురోగతి కనిపించింది. రెండు వారాల క్రితం సాలిస్బరీ ప్లెయిన్లో ఉక్రెయిన్ కోసం స్టార్మర్ హై-వెలాసిటీ మిస్సైల్ (HVM) లాంచర్‌ను యూకే ప్రదర్శించింది. 13 టన్నుల ఈ వాహనాలను ఉక్రెయిన్‌లోని ఫ్రంట్‌లైన్‌కు చేరవేయనున్న సి-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్. స్టార్మర్, స్టార్‌స్ట్రీక్ కలయిక ఉక్రెయిన్ పోరాట శక్తిని మరింత పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి.
స్టార్మర్ మిస్సైల్ సిస్టమ్ అంటే ఏంటి..?
స్టార్మర్ అనేది హై వెలాసిటీ మిస్సైల్ (HVM) లాంచర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ప్రధానంగా హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల ద్వారా ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు తయారీ. ఆపరేట్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు.. కమాండర్, ఆపరేటర్, డ్రైవర్ అవసరం. స్టార్మర్ మిస్సైల్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే.. పొడవు: 5.27మీ, వెడల్పు: 2.76మీ, ఎత్తు: 2.49 మీ ఉంది. షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ కోసం స్టార్మర్ను బ్రిటిష్ సైన్యం ఉపయోగిస్తుందని నివేదికలు తెలుపుతున్నాయి.
స్టార్మర్ మిస్సైల్ సిస్టమ్‌లు ఎలా పని చేస్తాయి?
స్టార్‌స్ట్రీక్ మిసైల్స్‌ను స్టార్మర్ ఉపయోగిస్తుంది, వీటిని వాహనం టరెట్ లేదా షోల్డర్ మౌంట్ నుండి కాల్చవచ్చు. ఉక్రెయిన్ దళాలకు వర్చువల్ శిక్షణ అందించిన తర్వాత మార్చిలో మొదటి విడత ఆయుధాలను యూకే పంపించింది. మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఈ మిసైల్స్‌కు తక్కువ ఎత్తులో ఎగిరే జెట్లు, హెలికాప్టర్లు, విమానాలను, భూమిపై టార్గెట్లను సులువుగా ఛేదించే సామర్థ్యం ఉంది. మిసైల్‌ను ప్రయోగించిన వెంటనే మూడు డ్రాఫ్ట్స్గా విడిపోతుంది.. దీంతో వరుస దాడులతో లక్ష్యాన్ని చేధించగలవు. ఇంపాక్ట్ ఫ్యూజ్, ఎక్స్‌ప్లోజివ్ వార్హెడ్లతో స్టార్‌స్ట్రీక్ మిసైల్ డ్రాఫ్ట్స్ తయారు చేశారు. మోటారు కాలిపోయే రెండో దశలో డ్రాఫ్ట్స్ విడుదలవుతాయని నివేదికలు చెబుతున్నాయి. 1500 నుండి 5500 మీటర్ల రేంజ్ ఉన్న మిసైల్స్‌కు.. తక్కువ ఎత్తులో ఎగిరే అత్యంత శక్తివంతమైన ఎగిరే విమానాలను కూడా నాశనం చేయగల శక్తి ఉంటుంది. సెమీ ఆటోమేటిక్, లైన్-ఆఫ్-సైట్ లేజర్ బీమ్ సాయంతో మిసైల్‌ను గైడ్ చేయగల ఆపరేటర్ ఉంది.
సిస్టమ్ ఆపరేషనల్ రేంజ్ 600 కిలోమీటర్లు, గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు వరు వెళ్లగలదు. రష్యాపై అత్యంత ప్రభావవంతంగా స్టార్మర్ మిసైల్స్ పని చేస్తాయని, మొబైల్ కాంబ్యాట్ వెహికల్స్‌గా ఉపయోగపడతాయని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. పుతిన్ వైమానిక దళం తక్కువ స్థాయి దాడికి ప్రయత్నించినప్పుడు స్టార్మర్ వ్యవస్థ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. భూమిపై లక్ష్యాలను కూల్చగల స్టార్‌స్ట్రీక్ మిసైల్స్‌కు.. యుద్ధ ట్యాంకుల ముందు కవచాన్ని ధ్వంసం చేయగల శక్తి ఉంది.
Russian Foreign Minister: " జైశంకర్ నిజమైన దేశ భక్తుడు".. భారత విదేశాంగ మంత్రిపై రష్యా ప్రశంసలు..
రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు యూకే సాయం..
ఏప్రిల్ 7న ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సహాయం అందిస్తామని యూకే పీఎం బోరిస్ జాన్సన్ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్‌కు 100 మిలియన్ పౌండ్లకు పైగా సైనిక ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు యూకే అందించిన అదనపు సైనిక సహాయం.. 800 కంటే ఎక్కువ NLAW యాంటీ ట్యాంక్ మిసైల్స్. అదనపు జావెలిన్ యాంటీ ట్యాంక్ సిస్టమ్స్, అదనపు లాటరింగ్ ఆయుధాలు, అదనపు స్టార్‌స్ట్రీక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అంతే కాకుండా.. బాలిస్టిక్ హెల్మెట్లు, బాడీ ఆర్మర్స్, నైట్ విజన్ గాగుల్స్ పంపించాయి. ఉక్రెయిన్ దళాలతో చర్చించి అవసరాలను తీర్చేలా ప్యాకేజీని రూపొందించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britan, England, Russia, Russia-Ukraine War, Vladimir Putin