హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UK To Send Missiles To Ukraine: ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న యూకే.. దీని వెనుక ఉన్న మర్మం అదేనా..?

UK To Send Missiles To Ukraine: ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న యూకే.. దీని వెనుక ఉన్న మర్మం అదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి ఆ దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సైనిక సహకారంలో భాగంగా ఉక్రెయిన్‌కు ప్రాణాంతకమైన యాంటీ షిప్ మిసైల్‌ హార్పూన్‌ను యూనైటెడ్ కింగ్ డమ్ (UK) అందిస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా(Ukraine-Russia) యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి ఆ దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్(Support) చేస్తున్న విషయం తెలిసిందే. సైనిక సహకారంలో భాగంగా ఉక్రెయిన్‌కు(Ukraine) ప్రాణాంతకమైన యాంటీ షిప్ మిసైల్‌ హార్పూన్‌ను(Missile harpoon) యూనైటెడ్ కింగ్ డమ్ (UK) అందిస్తోంది. ఉక్రెయిన్‌ నగరాలపై తరచూ దాడులు చేస్తున్న రష్యన్ యుద్ధనౌకలకు ఎదుర్కొనేందుకు ఈ సహాయాన్ని చేస్తోంది. తమ నల్ల సముద్రం ఓడరేవులపై రష్యన్ నేవీ దాడులను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌కు హార్పూన్ మిసైల్స్‌ ఉపయోగపడనున్నాయి. దీంతో రష్యాకు ఇది ఒకరకంగా ఎదురుదెబ్బే అని చెప్పాలి. రష్యాతో పోల్చుకుంటే అతి తక్కువ ఆయుధాలను కలిగి ఉన్న ఉక్రెయిన్ కు పలు దేశాలు సైనిక పరంగా సహాయం చేస్తుండటం రష్యాకు మింగుడుపడటం లేదు.

ALSO READ Intresting : మాట రాని మౌనమిది..చదివాకా చప్పట్లు కొట్టించే కథ ఈమెది

హార్పూన్ మిసైల్స్ అంటే ఏంటి.. ?

హార్పూన్ మిసైల్స్‌ను యూఎస్‌ ఆధారిత కంపెనీ బోయింగ్ డిఫెన్స్ తయారు చేసింది. దీనిని మొదటు 1977లో యూఎస్ నౌకాదళంలోకి ప్రేవేశింపచేశారు. ఇది పూర్తిగా యూఎస్ లోనే అభివృద్ధి చేశారు. హార్పూన్ మిసైల్స్‌ సిస్టమ్‌లో 500lb అధిక పేలుడు వార్‌హెడ్‌ను అవర్చేందుకు వీలు ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 15 అడుగుల పొడవు ఉండే హార్పూన్ మిసైల్స్‌కు కచ్చితత్వంతో 80 మైళ్ల పరిధి వరకు లక్ష్యాలను ఛేదించగల శక్తి ఉంటుంది. హార్పూన్ మిసైల్స్‌ను తరలించడం, వినియోగించడం సులువు కావడంతో ఉక్రెయిన్‌కు ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

ఫిక్స్‌డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, ఉపరితల నౌకలు, జలాంతర్గాములు, కోస్టల్‌ డిఫెన్స్‌ బ్యాటరీస్‌ ల ద్వారా హార్పూన్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు. అయితే ఈ హార్పూన్ మిసైల్స్‌లో పాత టెక్నాలజీ వినియోగిస్తారని రష్యా సైనం పక్కన పెట్టేసింది. ఉక్రెయిన్‌కు హార్పూన్ మిసైల్స్‌ అందిస్తే ఇక పశ్చిమ దేశాలు రహస్య ఆయుధాలు పంపాల్సిన అవసరం ఉండకపోవచ్చని రిపోర్ట్స్‌ లో తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అధునాతన రహస్య ఆయుధాలను పంపడం ప్రమాదకరం.. రష్యా చేతుల్లోకి ఆధునిక సాంకేతికత వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.

హార్పూన్ క్షిపణుల లోపాలు..

సంక్లిష్ట వాతావరణంలో లక్ష్యాల మధ్య తేడాను గుర్తించడంలో హార్పూన్ మిసైల్స్‌ విఫలం. అత్యాధునిక ప్రతిఘటనలను ఎదుర్కోవడంలో వెనుకంజ. ప్రయోగించిన తర్వాత దిద్దుబాట్లు చేసుకొనేందుకు వీలుగా డేటా లింక్ అందుబాటులో లేదు. హార్పూన్ మిసైల్స్‌ను ఇప్పటికే కభారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, చాలా NATO దేశాలు కొనుగోలు చేశాయి. 600 కంటే ఎక్కువ యుద్ధనౌకలు, 180 జలాంతర్గాములు, 12 రకాల విమానాలు హార్పూన్ మిసైల్స్‌ను కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఉక్రెయిన్‌ ఓడరేవులను దిగ్బంధించిన రష్యా..

నల్ల సముద్రంలోని కీలకమైన ఉక్రెయిన్ ఓడరేవులను యుద్ధ నౌకలతో రష్యా దిగ్బంధించింది. నల్ల సముద్రం నుంచి బయలుదేరకుండా 300 నౌకలను రష్యా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ధాన్యం రవాణాలో ప్రపంచ వాణిజ్య మార్గంలో నల్ల సముద్రంలోని ఉక్రెయిన్‌ ఓడ రేవులు కీలకం. ఉక్రెయిన్‌ సారవంతమైన ప్రాంతాలకు నెలవు. ధాన్యం ఎగుమతులతో ఐరోపాలో 'బ్రెడ్‌బాస్కెట్'గా గుర్తింపు ఉంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఓడ రేవులను రష్యా దిగ్బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఉక్రెయిన్‌ నావికాదళం హై రిస్క్ మైన్స్‌ ఏర్పాటు చేసినట్లు రష్యా చెబుతోంది. నల్ల సముద్రం మీద నియంత్రణను ఉపయోగించి ఒడ్డున ఉన్న సొంత దళాల అవసరాలను రష్యా నావికాదళం తీరుస్తున్నాయి. రష్యా ముందు తేలిపోయిన ఉక్రెయిన్ నౌకాదళం .. అయినా రష్యన్ యుద్ధనౌక RFS అడ్మిరల్ ఎస్సెన్‌పై దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ ప్రకటనపై నిర్దారణ కొరవడడంతో రష్యా నష్టపోయినట్లు ఎటువంటి సమాచారం తెలపలేదు.


Shocking : కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం..మధ్యలో ఆపేద్దామంది..కత్తితో దారుణంగా 16 పోట్లు

పాత హార్పూన్ మిసైల్స్‌ను యూకే తరలించిందా..?

రాయల్ నేవీ ఆధీనంలో ఉన్న హార్పూన్ మిసైల్స్‌ చాలా పాతవని సమాచారం. చాలా వరకు వాటి విశ్వసనీయత, భద్రతను ధ్రువీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాయల్ నేవీ స్టాక్‌లో కొన్ని హార్పూన్ మిసైల్స్‌ మాత్రం వినియోగించేందుకు పనికొస్తాయని సమాచారం. హార్పూన్ మిసైల్స్‌ నిర్వహణ, వినియోగంలో శిక్షణ పొందిన రాయల్ నేవీ సిబ్బంది సంఖ్య కూడా తగ్గుతున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి. కొత్త P8-A పోసిడాన్‌లు కొత్త హార్పూన్ వేరియంట్‌ ఆయుధాలను కలిగి ఉంటాయని రాయల్ వైమానిక దళం చెప్పింది. అయితే క్షిపణి కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో రాయల్‌ వైమానిక దళం తెలపలేదు.

First published:

Tags: Russia-Ukraine War, Uk, Ukraine

ఉత్తమ కథలు