లైంగిక వాంఛ పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువట...యూకే సర్వేలో షాకింగ్ బెడ్రూం సీక్రెట్స్..

ప్రముఖ వెబ్ పోర్టల్ ఇల్లిసిట్ కౌంటర్స్ నిర్వహించిన సర్వేలో దాదాపు 42 శాతం మంది పురుషులు తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ శృంగార సామర్థ్యం తమకే ఎక్కువ ఉందని పేర్కొంటే, 43 శాతం మంది మహిళలు మాత్రం తమ భర్తలు, బాయ్ ఫ్రెండ్స్ కన్నా తమ శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

news18-telugu
Updated: June 26, 2019, 8:41 PM IST
లైంగిక వాంఛ పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువట...యూకే సర్వేలో షాకింగ్ బెడ్రూం సీక్రెట్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూకేలో లైంగిక సంబంధాలపై నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పురుషులకన్నా స్త్రీలలోనే లైంగిక వాంఛలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. యూకేకు చెందిన ప్రముఖ వెబ్ పోర్టల్ ఇల్లిసిట్ కౌంటర్స్ నిర్వహించిన సర్వేలో దాదాపు 42 శాతం మంది పురుషులు తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ శృంగార సామర్థ్యం తమకే ఎక్కువ ఉందని పేర్కొంటే, 43 శాతం మంది మహిళలు మాత్రం తమ భర్తలు, బాయ్ ఫ్రెండ్స్ కన్నా తమ శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే మొత్తం 2000 మంది జంటలపై జరిపిన ఈ సర్వేలో దాదాపు 72 శాతం మంది జంటలు తమ పార్ట్ నర్ లైంగిక వాంఛ తీర్చడంలో విఫలమవుతున్నారని తేల్చిచెప్పారు.

అయితే సుమారు 52 శాతం మంది మహిళలు తమ పార్ట్ నర్ సరైన పడక సుఖం ఇవ్వకుంటే వేరే తోడు వెతుక్కుంటామని తెలుపగా, 56 శాతం మంది పురుషులు సైతం తమ భార్య పడక సుఖం ఇవ్వకపోతే వేరే తోడు కోరుకుంటామని తేల్చి చెప్పారు. ఇలా బ్రిటన్ దంపతులు తమ వింత కోరికలు బయటపెడుతుండటంతో అంతా అవాక్కవుతున్నారు.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading