లైవ్ షోలో ప్రాణం విడిచిన స్టాండప్ కమెడియన్

లైవ్ షోలో ప్రాణం విడిచిన స్టాండప్ కమెడియన్

ఇయాన్ కాగ్నెటో

‘షో ఇస్తున్న సమయంలో ఇయాన్ కాగ్నిటో ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు.

  • Share this:
    బ్రిటన్‌లో ప్రముఖ స్టాండప్ కమెడియన్ ఇయాన్ కాగ్నిటో మృతిచెందారు. ఓ లైవ్ షో ఇస్తూనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 12న ఈ ఘటన జరిగింది. దక్షిణ ఇంగ్లండ్‌లోని బైసిస్టర్ క్లబ్‌లో స్టాండప్ కామెడీ షో ఇస్తుండగా ఇయాన్ కాగ్నిటో కుప్పకూలారు. అక్కడివారు వైద్యులను పిలిపించారు. అయితే, స్పాట్‌లోనే చనిపోయినట్టు దక్షిణ మధ్య ఆంబులెన్స్ సర్వీస్ తెలిపింది. ‘షో ఇస్తున్న సమయంలో ఇయాన్ కాగ్నిటో ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు. అక్కడ షో చూడడానికి వచ్చిన వారు, నేను కూడా అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నాం.’ అని షో నిర్వాహకుడు ఆండ్రూ బర్డ్ బీబీసీకి తెలిపారు. కాగ్నిటో మరణంపై తోటి స్టాండప్ కమెడియన్లు సంతాపం తెలిపారు. ఇయాన్ కాగ్నిటో అసలు పేరు పాల్ బార్బెరీ.
    First published:

    అగ్ర కథనాలు