తండ్రి అయిన బ్రిటన్ ప్రధాని... మగబిడ్డకు జన్మనిచ్చిన సహచరి...

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఆయన సహచరి క్యారీ సైమండ్స్ తల్లిదండ్రులు అయ్యారు.

news18-telugu
Updated: April 29, 2020, 4:59 PM IST
తండ్రి అయిన బ్రిటన్ ప్రధాని... మగబిడ్డకు జన్మనిచ్చిన సహచరి...
బోరిస్ జాన్సన్ (Image : boris johnson / Instagram)
  • Share this:
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఆయన సహచరి క్యారీ సైమండ్స్ తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని యూకే ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. ఈ రోజు వారికి ఓ పండండి బాబు పుట్టాడని పేర్కొంది. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో కాన్పు జరిగినట్టు తెలిపింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రధాని జాన్సన్‌కు కరోనా సోకింది. ఆయన చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ సమయంలో తన పుట్టబోయే బిడ్డకు సంబంధించిన స్కానింగ్ రిపోర్టులు, తమ బిడ్డ భవిష్యత్తు గురించి సహచరి క్యారీ సైమండ్స్ చెప్పే మాటలు వినడం ద్వారా ప్రధానిలో సానుకూల ఫలితాలు కనిపించాయని అప్పట్లో వైద్యులు చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 29, 2020, 4:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading