Home /News /international /

UK PM BORIS JOHNSON VISITS KYIV AMID RUSSIA WAR MEETS UKRAINE PRESIDENT ZELENSKY MKS

Ukraine war: భయానక యుద్దం వేళ బ్రిటన్ ప్రధాని సాహసం.. కీవ్ సందర్శన.. జెలెన్‌స్కీతో భేటీ

 జెలెన్‌స్కీతో బోరిస్ జాన్సన్ (తాజా ఫొటో)

జెలెన్‌స్కీతో బోరిస్ జాన్సన్ (తాజా ఫొటో)

యుద్దభూమి ఉక్రెయిన్ లో బ్రిటన్ ప్రధాని పర్యటించారు. ఇప్పటికే భారీగా ధ్వంసమైన రాజధాని కీవ్ నగరానికి వెళ్లిన బ్రిటన్ ప్రధాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

పైనుంచి రష్యా వైమానిక దాడులు.. కింది నుంచి మిస్సైల్ దాడులు, ట్యాంకర్ బాబుల మోతలతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోన్న సమయాన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సాహసం చేశారు. యుద్దభూమి ఉక్రెయిన్ లో బ్రిటన్ ప్రధాని పర్యటించారు. ఇప్పటికే భారీగా ధ్వంసమైన రాజధాని కీవ్ నగరానికి వెళ్లిన బ్రిటన్ ప్రధాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శనివారం సమావేశం అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా విధానాలను ముందు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్న బ్రిటన్ ప్రధాని.. తానే స్వేయంగా కీవ్ వెళ్లి జెలెన్‌స్కీని కలుసుకోవడం విశేషం. ఈ ఇద్దరు నేతలు సమావేశమైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ ఫొటోను లండన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘సర్‌ప్రైజ్’’ అని రాసుకొచ్చింది.

జెలెన్‌స్కీతో బోరిస్ జాన్సన్

Vastu Tips: పడక గదిలో సుఖ సౌఖ్యానికి ఇవి పాటించాలి.. లేదంటే దాపత్యంపై ప్రభావం..


‘కీవ్ సందర్శనకు వచ్చిన బోరిస్ జాన్సన్.. ఇప్పుడ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వ్యక్తగతంగా చర్చ ప్రారంభించారు’ అని అధ్యక్షుడి సహాయకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే ఇద్దరు అధినేతల ఫొటో షేర్ చేస్తూ ‘ఉక్రెయిన్‌కు రక్షణలో బ్రిటన్ కీలక ప్రాధాన్యత పోషిస్తోంది’ అని మరో పోస్ట్ పెట్టారు. అయితే ఉక్రెయిన్‌కు తమ ప్రజల తరపున మద్దతును చూపించేందుకే బోరిస్ కీవ్‌కి వచ్చారని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడితో బ్రిటన్ ప్రధాని

KCR లేని వేళ భద్రాద్రికి తమిళిసై -సీఎం, గవర్నర్ Ram Navami 2022 సందేశాలివే -మళ్లీ ప్రోటోకాల్ రగడ?


భారీ సైనిక సంప్పతి కలిగిన రష్యాను ఉక్రెయిన్ ధీటుగా నిలువరిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఎక్కువ కాలం మద్దతుపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారని, అలాగే ఉక్రెయిన్‌కు ఆర్థిక, రక్షణ సహాయంపై చూడా మాట్లాడుతున్నారని ఒక కీలక నేత చెప్పినట్లు యూరప్‌కు చెందిన ఒక మీడియా సంస్థ పేర్కొంది.
Published by:Madhu Kota
First published:

Tags: Britain, Russia-Ukraine War, Uk, Ukraine, Zelensky

తదుపరి వార్తలు