బాధ్యత గల ఎంపీగారి బూతు వీడియో నిర్వాకం బ్రిటన్ పార్లమెంటులో సంచలనంగా మారింది. యూకేలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ నీల్ పరీశ్(65) (UK lawmaker Neil Parish) చట్టసభలోనే అశ్లీల వీడియో చూడటం.. అది కూడా మహిళా మంత్రులు పక్కనుండగా ఆ పని చేయడం కలకలం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీ ఎంపీ వ్యవహారాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఓవైపు విచారణ సాగుతున్నా ఒత్తిళ్లు పెరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వివరాలివి..
యూకే పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడైన నీల్ పరీశ్ శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ హౌజ్ లోనే అశ్లీల వీడియోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రతినిధుల సభలో తన పక్కన కూర్చున్న పరీశ్ అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని ఓ మహిళా మంత్రి స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెలెక్ట్ కమిటీ సమావేశాల్లోనూ సదరు ఎంపీగారు పోర్న్ చూడటాన్ని తాను చూశానని ఆ మహిళా మంత్రి పేర్కొన్నారు. అయితే ఎంపీ నిర్వాకాన్ని వీడియోలో రికార్డు చేయలేకపోయానని ఆమె తెలిపారు.
యూకేలో మే 5 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ అశ్లీల వీడియో వీక్షణం ఉదంతాన్ని అధికార కన్జర్వేటివ్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ముందుగా ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వెంటనే నీల్ పరీశ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, నిజానికి తాను ట్రాక్టర్ల వెబ్సైట్ చూసేందుకు యత్నించానని, అది పొరపాటున నీలిచిత్రాల వెబ్‌సైట్‌కు వెళ్లిందని పరీశ్ వివరణ ఇచ్చుకున్నారు.
పదవికి రాజీనామా చేసినప్పటికీ నీల్ పరీశ్ సభలో చేసిన నిర్వాకంపై పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిషనర్ క్యాథరిన్ స్టోన్ విచారణ కొనసాగనుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతేగనుక పరీశ్ సభకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఆయనపై అనర్హత వేటు కూడా పడొచ్చ. అశ్లీల వీడియోలు చూసి అడ్డంగా దొరికి పదవికి రాజీనామా చేసిన పరీశ్.. తన భార్య, కుటుంబీకులకు క్షమాపణలు చెప్పారు. విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adult film, Britain, Uk, United Kingdom