Home /News /international /

UK HOUSEHOLDS OFFERED 350 EUROS A MONTH FOR HOSTING UKRAINE REFUGEES UNDER NEW SCHEME PVN

Ukraine Refugees : కొత్త పథకం..ఉక్రెయిన్లకు ఆశ్రయమిస్తే నెలకు రూ.35 వేలు

బోరిస్ జాన్సన్ (Image : boris johnson / Instagram)

బోరిస్ జాన్సన్ (Image : boris johnson / Instagram)

New scheme for ukraine refugees : ఇంట్లో ఒక గదిలో అయినా సరే ఉక్రెయిన్లకు కనీసం ఆరు నెలలపాటు షెల్టర్ ఇవ్వడానికి ఒప్పుకుంటే హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ పథకం కింద నెలకు 350 పౌండ్లు అంటే రూ.35 వేలు చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలకు ఒక్కో శరణార్థికి 10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని బ్రిటన్ తెలిపింది.

ఇంకా చదవండి ...
UK New scheme for ukraine refugees : ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం నేటికి 19వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను సంధిస్తోంది. అయితే రష్యా దాడులతో లక్షలాది మంది ఉక్రెనియన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తమ పిల్లలతో సరిహద్దు దేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇలా ఉక్రెయిన్‌‌ నుంచి బ్రిటన్ వచ్చే ప్రజలను ఆదుకునేందుకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ అనే పేరుతో బ్రిటన్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ప్రకారం..బ్రిటన్ వచ్చే ఉక్రెయిన్ వ్యక్తి లేదా కుటుంబానికి బ్రిటన్ జాతీయులు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది. వారిని తమ ఇంట్లో లేదా తమకు చెందిన ఇతర భవనంలో ఉచితంగా ఉండనివ్వాలి. కనీసం ఆరు నెలల పాటు వారికి ఆశ్రయం కల్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం సోమవారం ప్రారంభించే వెబ్‌ సైట్‌ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. స్పాన్సర్ (బ్రిటన్ జాతీయులు), ఉక్రెయిన్ శరణార్థుల వివరాలను క్షణ్ణంగా తనిఖీ చేసి, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆ దరఖాస్తును ఆమోదిస్తారు. ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించినందుకు ఆ తర్వాత నుంచి నెలకు రూ.35వేలు ప్రభుత్వం ఇస్తుంది.

ALSO READ Russia-Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

ఇంట్లో ఒక గదిలో అయినా సరే ఉక్రెయిన్లకు కనీసం ఆరు నెలలపాటు షెల్టర్ ఇవ్వడానికి ఒప్పుకుంటే హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ పథకం కింద నెలకు 350 పౌండ్లు అంటే రూ.35 వేలు చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలకు ఒక్కో శరణార్థికి 10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని బ్రిటన్ తెలిపింది. కుటుంబ సంబంధాలు ఉన్నవారు మాత్రమే ఉక్రెయిన్ ఫ్యామిలీ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌ కు బ్రిటన్ మద్దతుగా ఉంటుందని, బ్రిటీష్ ప్రజలు ఉక్రెయిన్‌ లకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నారని యూకే మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు. ఈ మేరకు ఉక్రేనియన్ స్నేహితులకు మద్దతు అందించాలని ప్రజలను కోరుతున్నానని ఆయన అన్నారు. యుద్ధం కారణంగా బ్రిటన్‌ కు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రజలకు ఇచ్చిన వీసాల సంఖ్య 3 వేలకు చేరిందని మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు. అయితే, ప్రస్తుతం బ్రిటన్‌ ‌లో బంధువులు ఉన్న ఉక్రెనియన్లు మాత్రమే వస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకం ద్వారా వేలాది మంది యుక్రెనియన్లకు బ్రిటన్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి ఉక్రెయిన్ ప్రజలను వీలైనంత త్వరగా బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు ఈ పథకం సహాయ పడుతుందని మంత్రి మైఖేల్ చెప్పారు.

ALSO READ Lockdown In China : కరోనా విజృంభణ..చైనాలోని మరో నగరంలో లాక్ డౌన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి 25 లక్షల మందికి పైగా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థి సమస్య ఇదని పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia-Ukraine War, Uk, Ukraine

తదుపరి వార్తలు