Home /News /international /

UK HOME MINISTRY GREEN SIGNAL TO NIRAV MODI EXTRADITION TO INDIA AK

Nirav Modi: నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే గ్రీన్‌సిగ్నల్.. ఫలిస్తున్న భారత్ ప్రయత్నం

నీరవ్ మోదీ (File)

నీరవ్ మోదీ (File)

Nirav Modi: నీరవ్ మోదీ కోసం ముంబైలోని అర్థర్ రోడ్డు జైలులో బ్యారక్‌ను సిద్ధం చేసింది. నీరవ్ మోదీని ముంబై తీసుకొచ్చిన వెంటనే అర్థర్ రోడ్ జైలులోని 12 నంబర్ బ్యారక్‌లో ఉంచుతామని జైలు అధికారి తెలిపారు.

    భారత్‌ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లండ్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే హోంశాఖ అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా యూకేలోని న్యాయస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఫిబ్రవరి 25న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ముంబైలోని అర్థర్ రోడ్డు జైలులో బ్యారక్‌ను సిద్ధం చేసింది. నీరవ్ మోదీని ముంబై తీసుకొచ్చిన వెంటనే అర్థర్ రోడ్ జైలులోని 12 నంబర్ బ్యారక్‌లో ఉంచుతామని జైలు అధికారి తెలిపారు. ఈ బ్యారక్‌కు సెక్యూరిటీ అత్యంత పటిష్టంగా ఉంటుంది.

    సుమారు రూ.14 కోట్ల విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నీరవ్ మోదీ నిందితుడు. ఆయన ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, భారత్‌లో జైళ్ల గురించి, ఇతరత్రా అంశాలను లేవనెత్తుతూ పలుమార్లు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. కొన్నాళ్లు నీరవ్ మోదీకి పెద్దగా ఎదురుదెబ్బ తగలకపోయినా.. ఆ తర్వాత అక్కడి కోర్టు ఆయన్ను జైల్లో పెట్టింది. అనంతరం ఆయన్ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. భారత్‌లో జైళ్ల మీద నీరవ్ మోదీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ బ్యారెక్ నెంబర్ 12 బాగుందని స్పష్టం చేసింది. అయితే, దీనిపై నీరవ్ మోదీ స్థానిక హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు.

    నీరవ్ మోదీ మీద భారత్‌లో రెండు రకాలైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ కేసు కొనసాగుతోంది. అందులో ఒప్పంద పత్రాలు, లోన్ అగ్రిమెంట్లకు సంబంధించిన విచారణ జరుగుతోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Nirav Modi, Punjab National Bank, Uk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు