బ్రిటన్‌లో తొలి సోలార్ పవర్ ట్రాక్... ఇవీ ప్రత్యేకతలు

Solar-Powered Train : పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సోలార్ పవర్‌ను ఎక్కువగా వాడుతున్నారు. రైళ్లు, ట్రాక్స్ కూడా సోలార్ పవర్‌తో నడిచేలా చేస్తున్నారు. అలాంటి ఓ ట్రాక్... బ్రిటన్‌లో ఏర్పాటైంది. దాని విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 28, 2019, 3:06 PM IST
బ్రిటన్‌లో తొలి సోలార్ పవర్ ట్రాక్... ఇవీ ప్రత్యేకతలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Solar-Powered Train : రైళ్లలో చిన్న మొత్తంలో సోలార్ పవర్ వాడకం కొన్నేళ్లుగా ఉంది. ఐతే... రైల్వే ట్రాక్ మొత్తం సోలార్ పవర్‌తో వెళ్లడం మాత్రం ఈమధ్యే మొదలైంది. బ్రిటన్‌లోని హ్యాంప్‌షైర్‌లో అలాంటి ఓ ట్రాక్ ప్రారంభించారు. బ్రిటన్ నెట్‌వర్క్ రైల్... సోలార్ పవర్డ్ లైన్‌ను హ్యాంప్‌షైర్‌లోని అల్డెర్‌షాట్‌లో ఆగస్టులో రెడీ చేసింది. ఈ మార్గంలో మొత్తం 100 వంద సోలార్ పవర్ ప్యానెళ్లు... రైలు నెట్‌వర్క్‌కి ఎనర్జీని అందిస్తాయి. ఈ రూట్‌లో రైల్వే సిగ్నల్స్, లైట్స్ అన్నీ... సోలార్ ఎనర్జీని వాడుకుంటాయి. బ్రిటన్ ప్రభుత్వం ప్రతీ అంశంలో సోలార్ పవర్ వాడకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 30కిలోవాట్ల పైలట్ స్కీమ్‌లో భాగంగా రైల్వే ట్రాక్‌ మొత్తాన్నీ సోలార్ పవర్ ప్యానెళ్ల నుంచీ వచ్చే పవర్‌తో పనిచేసేలా చేస్తోంది.

 


బ్రిటన్ నెట్‌వర్క్ రైల్ సంస్థ... భవిష్యత్ సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. తద్వారా... బ్రిటన్‌లో డీజిల్ ట్రైన్లను పూర్తిగా ఆపేసి... కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటోంది. బ్రిటన్‌లోని చాలా రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ వాడకం ఉంది. ఐతే... ట్రాక్ మొత్తాన్నీ సోలార్ పవర్ ద్వారానే నడిపించడం ఇదే తొలిసారి.

 


రైళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా... ట్రాకులపై ట్రైన్ సోలార్ ఎనర్జీతో వెళ్లేలా చెయ్యగలుగుతున్నారు. ప్రపంచ మొట్టమొదటి పూర్తి సోలార్ పవర్‌తో పనిచేసే రైలు... 2017లో ఆస్ట్రేలియాలో మొదలైంది. ది బైరన్ బే రైల్ రోడ్ కంపెనీ ఆ రైలును తయారుచేసింది. 1949 నాటి వింటేజ్ రైలుకు మెరుగులు దిద్దింది. ఫలితంగా ఆ ట్రైన్... సముద్ర తీరం వెంట 3 కిలోమీటర్లు సోలార్ ఎనర్జీతో వెళ్తోంది. ఇందులో పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అవ్వాలంటే... సూర్యరశ్మి తప్పనిసరి. ఎండ లేకపోయినా, వర్షం పడినా... రైళ్లు ముందుకు సాగవు.

 


ఇండియా సహా చాలా ఆసియా దేశాలు రైళ్లు పరిగెత్తేందుకు బొగ్గును బాగా వాడేస్తున్నాయి. ఐతే... 2017లో భారత దేశం తొలిసారిగా సోలార్ పవర్ ట్రైన్‌ను తెచ్చింది. ఐతే... ఇందులో పవర్ ప్యానెళ్లు, ఫ్యాన్లు, ఫిక్చర్లు మాత్రమే సోలార్ పవర్‌ను వాడుతున్నాయి. ఫలితంగా ఆ ట్రైన్... ఏటా 40 శాతం తక్కువ ఖర్చుతో నడుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు... రైల్వే ట్రాకుల వెంట సోలార్ పవర్ సంస్థల్ని ఏర్పాటు చెయ్యబోతోంది. వచ్చే పదేళ్లలో ప్రపంచంలోనే తొలి గ్రీన్ రైల్వే నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసే ప్లాన్ కలిగివుంది.

 

Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :

Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...


Health Tips : భారతీయుల్లో లోపిస్తున్న పోషకాలు ఇవీ... ఏం చెయ్యాలంటే
First published: October 28, 2019, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading