తండ్రి ఆశీస్సుల కోసం ఎవరూ చేయని పనిచేసిన పెళ్లికూతురు

ఆమె పెళ్లికి సరిగ్గా నాలుగు నెలల ముందు తండ్రి చనిపోయాడు. ఆ బాధ నుంచీ కోలుకోలేకపోయిన ఆమె... తన పెళ్లికి... తండ్రి తనతోనే ఉండే అనుభూతి కలిగేలా చేసుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 12:17 PM IST
తండ్రి ఆశీస్సుల కోసం ఎవరూ చేయని పనిచేసిన పెళ్లికూతురు
నెయిల్ పాలిష్ (credit - YT - Kirsty Meakin)
  • Share this:
బ్రిటన్‌లోని చార్లొట్టే వాట్సన్ తండ్రి మిక్ బార్బెర్స్ కాన్సర్ కారణంగా... ఆమె పెళ్లికి 4 నెలల ముందు చనిపోయారు. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది. తండ్రి అస్తికల బూడిదను సేకరించిన చార్లొట్టే... ఆ బూడిదను... గోళ్ల రంగులో కలిపి... తన గోళ్లకు వేయించుకుంది. తద్వారా పెళ్లి జరిగేటప్పుడు తండ్రి తనతోనే ఉన్నట్లుగా అనుభూతి చెందింది. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు సోషల్ మిడియాలో చర్చ సాగుతోంది. చార్లొట్టే కజిన్ క్రిస్టీ మీకిన్... నెయిల్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. చార్లొట్టే బాధపడుతూ ఉండటాన్ని గమనించిన క్రిస్టీ... తనే స్వయంగా ఈ ఐడియా ఇచ్చింది. ఈ విషయాన్ని తన కాబోయే భర్త నిక్‌కి చెప్పగా... తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ సరికొత్త నెయిల్ పాలిషింగ్ ఆలోచన కార్యరూపం దాల్చింది.

క్రిస్టీ మీకిన్‌ యూట్యూబ్ ఛానెల్‌లో పది లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. చిన్న గ్లాస్ పాట్‌లో బూడిదను సేకరించిన క్రిస్టీ... దాన్ని... చిన్న భాగాలుగా తీసుకొని... నెయిల్ పాలిష్‌లో కలిపింది. పింక్, గ్రే, వైట్ డిజైన్లలో పాలిష్ వేసిన క్రిస్టీ... వజ్రాలతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.


చార్లొట్టే తన తండ్రిని నెయిల్ పాలిష్ రూపంలోనే కాదు... మరెన్నో రకాలుగా స్మరించుకుంది. తన షూస్ వెనక... తండ్రి ఫొటోలను పెట్టించుకుంది. తన ఫ్లవర్స్‌కి ఉన్న పెండాంట్‌లో తండ్రి ఫొటోను ఎటాచ్ చేసుకుంది. జీన్స్‌లో, టెడ్డీలో కూడా తండ్రి ఫొటోలను ఫిక్స్ చేయించుకుంది. నెటిజన్లు కూడా తండ్రి పట్ల చార్లొట్టే చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading