హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Viral video: అమెరికాకు ఏలియన్స్ టెన్షన్.. ఆ వీడియోలో 14 UFOలు.. ఏం జరుగుతోంది?

Viral video: అమెరికాకు ఏలియన్స్ టెన్షన్.. ఆ వీడియోలో 14 UFOలు.. ఏం జరుగుతోంది?

అమెరికాకు ఏలియన్స్ టెన్షన్.. ఆ వీడియోలో 14 UFOలు (image credit - instagram)

అమెరికాకు ఏలియన్స్ టెన్షన్.. ఆ వీడియోలో 14 UFOలు (image credit - instagram)

Viral video: అమెరికా అధ్యక్షుడిగా చేసిన సమయంలో డొనాల్డ్ ట్రంప్... గ్రహాంతరవాసులతో గొడవకు దిగారా? వాళ్లతో యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నారా? ఏం జరిగిందో తెలుసుకుందాం.

  Viral video: ఏలియన్స్, గ్రహాంతరవాసులు, UFOలు, ఎగిరేపళ్లాలు... ఇవి మనం తరచూ వింటూ ఉంటాం. మన దేశంలో ఎప్పుడూ ఇలాంటివి కనిపించవు. అమెరికాలో మాత్రం తరచూ కనిపిస్తాయి. మరి మనకు కనిపించని UFOలు వాళ్లకే ఎందుకు కనిపిస్తాయనేది ఓ షాకింగ్ ప్రశ్న. దానికి ఆన్సర్ లేదు. అది అలా ఉంచితే... తాజాగా ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే... అందులో ఏకంగా 14 UFOలు గాల్లో తిరుగుతూ కనిపించాయి. అవి అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నౌక చుట్టూ 2019 జులైలో తిరిగాయి. అందుకు సంబంధించిన రహస్య వీడియో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఇలాంటి వాటిపై పరిశోధనలు చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్‌మేకర్ జెరెమీ కార్బెల్ (Jeremy Corbell) ఈ వీడియోను రిలీజ్ చేశారు.

  ఈ నెల ప్రారంభంలోనే ఓ UFO సముద్రంలోకి వెళ్లిపోయే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అది నిజమైన ఫుటేజే అని అమెరికా నౌకాదళం చెప్పింది. మరి ఇప్పుడు కొత్త వీడియోలో... కనిపించిన 14 UFOల ఫుటేజ్ కూడా అప్పటిదే, అదే సంఘటనకు చెందినదే అంటున్నారు కార్బెల్. ఇందులో ఒమహా (omaha) నౌకలోని రాడార్ స్క్రీన్‌పై అవి కనిపించాయి. అవి గంటకు 70 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు అంచనా ఉంది. ఆ వీడియో మీరే చూడండి. ఈ వీడియోని నౌకలోని... కమాండ్ సెంటర్‌లో షూట్ చేసి ఉంటారని కార్బెల్ అంటున్నారు.

  గ్రహాంతరవాసులకు సంబంధించి అమెరికా ఏదో సీక్రెట్ దాస్తోందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్... అమెరికా స్పేస్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా... అంతరిక్షంలో జరిగే యుద్ధాల్లో ఈ సైన్యం పోరాడుతుందని తెలిపారు. ఆ ఆర్మీ ఏర్పాటు వెనక ఏలియన్స్ ఉండి ఉండొచ్చనే అనుమానం ఉంది. ఏలియన్స్‌కి వ్యతిరేకంగా దాన్ని ఏర్పాటుచేయాలనుకున్నారా... లేక... ఏలియన్సే ట్రంప్ ద్వారా దాన్ని ఏర్పాటు చేయిస్తున్నారా అనేది తేలలేదు.


  ఇది కూడా చదవండి: Bamboo Leaf Tea: వెదురు ఆకుల టీ... ఆ అనారోగ్య సమస్యలకు అసలైన పరిష్కారం

  అమెరికాలోని ఏరియా 51లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. అక్కడ గ్రహాంతరవాసులపై పరిశోధనలు జరుగుతున్నాయని ఏళ్లుగా ప్రచారం సాగుతున్నా... అక్కడ అడుగు పెట్టేందుకు కూడా వీలుండదు. అందువల్ల అక్కడ ఏం జరుగుతోంది అనేది ఎవ్వరికీ తెలియదు. నౌక చుట్టూ 14 UFOలు వస్తే... ఈ విషయాన్ని అమెరికా ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏలియన్స్‌తో అమెరికా డీల్స్ కుదుర్చుకుందా లేక... ఏలియన్స్‌తో అమెరికా యుద్ధానికి కాలు దువ్విందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ మిస్టరీగా మిగిలిపోతున్నాయి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: America

  ఉత్తమ కథలు