హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

UAE New Law: స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని ఈ ఒక్క మిస్టేక్ చేశారో.. రూ.కోటి జరిమానాతోపాటు..

UAE New Law: స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని ఈ ఒక్క మిస్టేక్ చేశారో.. రూ.కోటి జరిమానాతోపాటు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు అస్సలు తీయొద్దు. పొరపాటున ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీస్తే లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల వరకు జరిమానా పడుతుంది. అంతే కాదండోయ్ ఆరు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇదేం చట్టం. ఎప్పుడు తెచ్చారు అని అవాక్కవుతున్నారా..?

ఇంకా చదవండి ...

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా.? అద్భుతమైన కెమెరా ఫీచర్స్ మీ ఫోన్ సొంతమా.? అయితే మీ ఫొటోలో, మీ ఫ్యామిలీ ఫొటోలో తీసుకోవడం వరకే పరిమితం అవండి. మీరు అంతగా ప్రకృతి ప్రేమికులయితే చెట్లు, పుట్టలను ఫొటోలు తీసుకోండి. కానీ దారిన పోయే వాళ్లు అందంగా ఉన్నారనో, ఏదో ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతోందనో వారి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు అస్సలు తీయొద్దు. పొరపాటున ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీస్తే లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల వరకు జరిమానా పడుతుంది. అంతే కాదండోయ్ ఆరు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇదేం చట్టం. ఎప్పుడు తెచ్చారు అని అవాక్కవుతున్నారా..? ఇక్కడ కాదులెండి. కఠినమైన చట్టాలు అమల్లో ఉండో ఓ గల్ఫ్ దేశంలో. మరి ఆ గల్ఫ్ దేశం కొత్తగా తెచ్చిన చట్టమేంటో, అందులోని నిబంధనలేంటో ఓ లుక్కేయండి

గల్ఫ్ దేశమైన యూఏఈలో కఠినమైన నిబంధనలు ఉంటాయని అందరికీ తెలిసిందే. సౌదీ అంత కఠినం కాకున్నా దాని తర్వాత నియమనిబంధనలను కఠినంగా అమలు చేసే దేశాల్లో యూఏఈ ఒకటి. ఆ దేశానికి పర్యాటకులు కూడా లక్షల సంఖ్యల్లో వస్తుంటారు. అయితే ఇలా పర్యాటకులుగా వస్తున్న వారి ఫొటోలను అనుమతి లేకుండా దుబాయి పౌరులు తీస్తున్నారట. కొంతమంది పర్యాటకులు కూడా దుబాయి పౌరుల ఫొటోలను తీసుకుని వారి అనుమతి లేకుండా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారట. ఇది కాస్తా వ్యక్తిగత భద్రతకు భంగం కలిగే స్థితికి చేరుకుంది. దీంతో దుబాయి సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలను చేపట్టింది. కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా యూఏఈ ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైబర్ క్రైమ్ చట్టంలో మార్పులను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎదుటి వారి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలను తీస్తే అది చట్టరీత్యా నేరం. ఆ ఫొటోలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నా, ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా శిక్షార్హులు. ఈ నేరానికి గాను లక్షా 50 వేల దిర్హమ్స్ (సుమారు 30 లక్షలు) నుంచి 5 లక్షల దిర్హమ్స్ (దాదాపు కోటి రూపాయలు) వరకు జరిమానా విధిస్తారు. దీంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా వేస్తారు. కాబట్టి భారతీయులూ, మీరెప్పుడైనా దుబాయి పర్యటనకు వెళ్తే ఈ నిబంధన గురించి మాత్రం మర్చిపోకండి.

First published:

Tags: Dubai, International news, NRI News, Photos, UAE

ఉత్తమ కథలు