Home /News /international /

TWO YEARS OLD GIRL FROM TURKEY KILLS SNAKE BITING WITH TEETH AFTER IT BITES HER SK

Baby kills Snake: కాటేసిన పామును.. కసిదీరా కొరికి చంపిన రెండేళ్ల చిన్నారి.. మరి పాప పరిస్థితి..?

పామును కొరికి చంపిన బాలిక

పామును కొరికి చంపిన బాలిక

Baby Kills Snake: పాము కరవడంతో పాపకు కోపమొచ్చింది. వెంటనే దానిని చేత్తో తీసుకొని.. నోట్లో పెట్టుకుంది. పళ్ల కింద ఉంచి.. గట్టిగా కొరికింది.  ఎడా పెడా కొరికేయడంతో ఆ పాము చనిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    పసిపిల్లలు అమాయకులు. వారికి అమ్మ తప్ప మరో లోకం ఉండదు. ఆకలయినప్పుడు పాలు తాగడం... ఆ తర్వాత ఆడుకోవడం... ఈ రెండే తెలుసు. వారి నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. మంచి చెడులు.. తప్పొప్పులు ఏమీ తెలియదు. అందుకే ఒక్కోసారి తమకు తెలియని పనులు చేసి.. ప్రమాదంలో పడతారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఓ అమ్మాయి గురించే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. టర్కీకి చెందిన పసిపాపను పాము కాటు (Snake Bite) వేయడంతో.. ఆ బాలికకు కోపం వచ్చింది. దానిని పట్టుకొని పళ్లతో పసపసా నమిలేసింది . ఆ తర్వాత ఏం జరిగింది? పాపకు ఏమయింది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందా.

    Two Marriages: అక్కడ ప్రతి అబ్బాయి 2 పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైల్లో వేస్తారు !


    టర్కీ (Turkey)లోని బింగోల్ నగరంలో ఉన్న కాంటార్ అనే చిన్న గ్రామంలో ఆగస్టు 10న ఆసక్తికరమైన.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికను పాము కాటువేసింది. తండ్రి పనికి వెళ్లాడు. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఆ సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఎటు నుంచి వచ్చిందో గానీ.. ఓ పాము బాలిక వద్దకు వెళ్లి.. ఆ చిన్నారిని కాటేసింది. దాదాపు అరమీటరు పొడవున్న పాము.. బాలిక పెదాలపై కరిచింది. పాము కరవడంతో పాపకు కోపమొచ్చింది. వెంటనే దానిని చేత్తో తీసుకొని.. నోట్లో పెట్టుకుంది. పళ్ల కింద ఉంచి.. గట్టిగా కొరికింది.  ఎడా పెడా కొరికేయడంతో ఆ పాము (Toddler Bites Snake With Teeth) చనిపోయింది. అనంతరం పాప బిగ్గరగా ఏడవడంతో.. తల్లి పరుగెత్తికొచ్చింది. బాలిక నోటికి రక్తపు మరకలు ఉండడం.. అక్కడే ఓ పాము చనిపోయి ఉండడం.. దానిపై పంటి గాట్లు ఉండడంతో.. తల్లి కంగారుపడింది. తన కూతురు పామును కొరికి చంపిందిని అర్ధమయింది. అదే సమయంలో పాప పెదాలపై పాము కాటేసిన ఆనవాళ్లు ఉండడంతో.. భయపడిపోయింది. ఇరుగుపొరుగు వారి సాయంతో.. హుటాహుటిన బింగోల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.





    పాము బాలిక పెదాలపై కాటువేసినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సకాలంలో పాము కాటుకు విరుగుడు మందును ఇచ్చారు. అనంతరం చిన్నారిని 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత బాలిక క్రమంగా కోలుకుంది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అల్లా దయ వల్లే తమ పాప బతికిందని సంతోషపడ్డారు. ప్రస్తుతం ఈ బాలిక గురించే టర్కీ ప్రజలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా, టర్కీలో దాదాపు 45 రకాల పాములు నివసిస్తున్నాయి. అందులో 12 రకాల పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Turkey

    తదుపరి వార్తలు