అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రెండు విమానాలు గాల్లో ఢీకొని.. అనంతరం సరస్సులో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇదాహో స్టేట్‌లో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నాయి. కోయర్ డీఅలెన్ సరస్సు మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమానాలు సరస్సులో మునిగిపోయాయి. ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా.. వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. విమానాలు సరస్సులో మునిగిపోయాయని.. సోనార్ సాయంతో శకలాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురికి కోసం గాలిస్తున్నారు. వారు కూడా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇక సరస్సు నుంచి విమాన శకలాలను బయటకు తీసేందుకు రెండు రోజుల సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఐతే ప్రమాదానికి గురైన వివరాలు, అందులో ఎంత మంది ప్రయాణిస్తున్నారన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. శకలాలు బయటకు వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేష్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Plane Crash