Home /News /international /

TWO PLANES COLLIDE IN CALIFORNIA DURING LANDING PVN

Two planes collide : ల్యాండింగ్ టైంలో ఢీకొన్న రెండు విమానాలు..ఎంతమంది చనిపోయారంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two planes collide : ఉత్తర కాలిఫోర్నియాలో వాట్సన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో రెండు విమానాలు(ట్విన్-ఇంజిన్ సెస్నా 340, సింగిల్ ఇంజిన్ సెస్నా 152) ఒకదానినొకటి ఢీకొన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Two planes collide : ఉత్తర కాలిఫోర్నియా(Northern California)లో వాట్సన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో రెండు విమానాలు(ట్విన్-ఇంజిన్ సెస్నా 340, సింగిల్ ఇంజిన్ సెస్నా 152) ఒకదానినొకటి ఢీకొన్నాయి(Two Planes Collide). ఈ ప్రమాదంలొ ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్రాష్ సమయంలో ట్విన్-ఇంజిన్ సెస్నా 340లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, సింగిల్ ఇంజిన్ సెస్నా 152లో పైలట్ మాత్రమే ఉన్నారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA)అధికారులు చెబుతున్నారు.

విమానాలు ఢీకొన్న సమయంలో పైలట్‌లు విమానాశ్రయానికి చివరిగా చేరుకుంటున్నారని FAA ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదనికి గల కారణాలపై FAA,నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలలో....విమానాశ్రయం వద్ద గడ్డి మైదానంలో ఒక చిన్న విమానం యొక్క శకలాలు చూపించాయి. ఒక ఫోటో విమానాశ్రయానికి సమీపంలోని వీధి నుండి కనిపించే పొగను చూపించింది.

Kabul Blast: ఆఫ్ఘన్‌లో బాంబుల మోత.. కాబూల్‌ మసీదులో భారీ పేలుడు.. 20 మందికిపైగా మృతి

వాట్సన్‌విల్లే నగరం యొక్క ఓ ఫోటో... విమానాశ్రయంలోని ఒక చిన్న భవనానికి నష్టం కలిగించినట్లు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నట్లు చూపించింది. మాంటెరీ బే సమీపంలోని వాట్సన్‌విల్లే... శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా 100 మైళ్లు (160 కిలోమీటర్లు) దూరంలో ఉంది.


మరోవైపు,అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ (Kabul Blasts)మరోసారి రక్తసిక్తమైంది. కాబూల్‌లోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో బుధవారం భారీ పేలుడు సంభవించింది. స్థానిక ప్రజలు మసీదులో నమాజు చేస్తున్న సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. పెద్ద శబ్దంతో భారీ పేలుడు (Kabul Explosion) సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మరో 40 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు. బాంబు పేలుడుపై సమాచారం అందిన వెంటనే.. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించాయి. 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతుండగా.. స్థానిక మీడియా మాత్రం మృతుల వివరాలను వెల్లడించడం లేదు. తాలిబన్లకు భయపడే మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియదు. ఏ ఉగ్రసంస్థ కూడా దీనిపై ప్రకటన చేయలేదు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Plane Crash, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు