హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

OMG : వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఆటోపైలట్ లో పెట్టి నిద్రపోయిన పైలట్లు..కళ్లు తెరిచాక షాక్!

OMG : వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఆటోపైలట్ లో పెట్టి నిద్రపోయిన పైలట్లు..కళ్లు తెరిచాక షాక్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pilots Sleep While Flying : విమానం గాల్లో ఉండగా పైలట్లు ఆదమరచి నిద్రపోయారు. అసలేం జరుగుతుంలో సోయ కూడా లేకుండా హాయిగా నిద్రపోయారు. వేల అడుగుల ఎత్తులో విమానం గాల్లో ఉన్న సమయంలో ఆటో పైలట్ మోడ్ లో విమానాన్ని ఉంచి..హాయిగా కునుకుతీశారు ఇద్దరు పైలట్లు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pilots Sleep While Flying : విమానం గాల్లో ఉండగా పైలట్లు(Pilots) ఆదమరచి నిద్రపోయారు(Sleep). అసలేం జరుగుతుంలో సోయ కూడా లేకుండా హాయిగా నిద్రపోయారు. వేల అడుగుల ఎత్తులో విమానం(Flight) గాల్లో ఉన్న సమయంలో ఆటో పైలట్ మోడ్ లో విమానాన్ని ఉంచి..హాయిగా కునుకుతీశారు ఇద్దరు పైలట్లు. అయితే వీరి నిద్ర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది.

అసలేం జరిగింది

శుక్రవారం ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 #ET343విమానం సూడాన్‌లోని ఖార్టూమ్‌ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్‌ అబాబా(Addis Ababa)కు ప్రయాణికులతో బయల్దేరింది. విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్‌లు నిద్రలోకి జారుకున్నారు. విమానం ఆటోపైలట్‌లో ఉంది. ఫ్లైట్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్ (FMC)ఏర్పాటు చేసిన మార్గానికి అనుగుణంగా విమానం ప్రయాణిస్తోంది. అయితే విమానం.. దాని కోసం నిర్దేశించిన రన్‌వేలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. విమానం నిర్ణీత రన్‌వేలో దిగలేదని, తమ కాల్స్ కి పైలట్లు సమాధానం ఇవ్వడం లేదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు గుర్తించారు. అయితే ఆటోపైలట్ నుండి డిస్‌కనెక్ట్ అయిన త్వరాత విమానం డిస్‌కనెక్ట్ వైలర్ బిగ్గరగా మోగడంతో పైలట్‌లు మేల్కొన్నారు. 37,000 అడుగుల ఎత్తులో రన్‌వేను అధిగమించిన 25 నిమిషాల తర్వాత పైటల్లు విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఏం జరుగుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. విమానం 25 నిమిషాలు ఆలస్యంగా సేఫ్ గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత దాదాపు 3 గంటల పాటు ఎయిర్ పోర్ట్ లోనే ఉండి..ఆ తర్వాత తదుపురి జర్నీకి బయట్లేదరి వెళ్లింది.

Two planes collide : ల్యాండింగ్ టైంలో ఢీకొన్న రెండు విమానాలు..ఎంతమంది చనిపోయారంటే


ఏవియేషన్ అనలిస్ట్ అలెక్స్ మాచెరాస్ ఒక ట్వీట్‌లో.."ఈ పరిణామం చాలా ఆందోళనకరం. ఆఫ్రికాలోని అతిపెద్ద విమానయాన సంస్థ - ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 #ET343లో జరిగిన సంఘటన గురించి లోతుగా చెప్పాలంటే, అది తన గమ్యస్థానమైన అడిస్ అబాబాకు చేరుకునే సమయానికి 37,000 అడుగుల ఎత్తులో ఉంది. ల్యాండింగ్ కోసం అది ఎందుకు దిగడం ప్రారంభించలేదు? పైలట్‌లు ఇద్దరూ నిద్రలో ఉన్నారు"అని పేర్కొన్నారు. పైలట్ అలసట అనేది పాత సమస్య, అంతర్జాతీయంగా వాయు భద్రతకు ముప్పు కలిగించే ముఖ్యమైన సమస్య అని మచెరాస్ అన్నారు.

కాగా, ఈ ఏడాది మే నెలలో కూడా న్యూయార్క్ నుండి రోమ్‌కు విమానం వస్తుండగా ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్న విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పైలట్ అలసటను అర్థం చేసుకోవడంలో విమానయాన పరిశ్రమ అసమర్థతను పైలట్ సంఘాలు నిందించాయి.'తాగిన డ్రైవర్‌కు కారు తాళంని అప్పగించడంతో ఈ పరిణామాలను పోల్చాయి. పైలట్ అలసటకు సంబంధించిన సమస్యలను సంబంధిత సంఘాలు లేవనెత్తినప్పుడు... పైలట్‌లను అదనపు దూరం వెళ్లమని విజ్ ఎయిర్, జెట్2 అనే రెండు బడ్జెట్ విమానయాన సంస్థల CEOలు కోరడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

First published:

Tags: Flight, Pilot, Sudan

ఉత్తమ కథలు