Srilanka Blasts Live Updates : శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తల మృతి

  • News18 Telugu
  • | April 22, 2019, 10:53 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 3 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    12:43 (IST)

    శ్రీలంక పేలుళ్లలో విదేశీ మృతులు 37 మంది ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

    11:40 (IST)

    శ్రీలంక స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం జరిగిన 8 పేలుళ్లలో ఆరు పేలుడు ఘటనలు ఆత్మాహుతి దాడులుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

    11:37 (IST)

    శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    11:33 (IST)

    జేడీఎస్ కార్యకర్తల మృతిని ధ్రువీకరించిన కర్ణాటక సీఎం

    శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు మృతి చెందారన్న విషయం తెలిసి షాక్‌కి గురైనట్టు కర్ణాటక సీఎం కుమారస్వామి తెలిపారు. పేలుళ్ల తర్వాత ఏడుగురు సభ్యులతో కూడిన జేడీఎస్ టీమ్ మిస్ అయినట్టు చెప్పారు. శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్‌తో తాను టచ్‌లో ఉన్నట్టు తెలిపారు.

    10:47 (IST)

    శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తల మృతి

    శ్రీలంక పేలుళ్లలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు మృతి చెందినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. కొలంబోలోని షాంగ్రీ-లా హోటల్లో మొత్తం 20మంది జేడీఎస్ కార్యకర్తలు బస చేయగా.. ఆదివారం నాటి పేలుడు ఘటనతో ఇందులో ఇద్దరు మృతి చెందారు.

    10:40 (IST)

    భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు.

    10:34 (IST)

    శ్రీలంకలో పేలుళ్లలో ఆరుగురు భారతీయుల మృతి

    శ్రీలంక పేలుళ్లలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందగా.. ఇందులో ఆరుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుళ్లలో ఆరుగురు భారతీయులు మృతి చెందినట్టు ఆదివారం సాయంత్రం వెల్లడించగా.. సోమవారానికి ఆ సంఖ్య 6కిపెరిగింది. విదేశీ మృతుల్లో అమెరికన్లు, జపనీస్, చైనీస్, పోర్చుగీస్, డెన్మార్క్ సహా పలు దేశాలకు చెందినవారు ఉన్నారు.

    9:59 (IST)

    శ్రీలంక పేలుళ్లు వారి పనే అని ఇంటలిజెన్స్ రిపోర్ట్

    పేలుళ్లపై తమకు ముందే సమాచారం ఉందని.. అయితే వాటిని అడ్డుకునే చర్యల విషయంలో విఫలమయ్యామని శ్రీలంక ప్రధాని విక్రమ్‌సింఘే తెలిపారు. శ్రీలంకకు చెందిన నేషనల్ తౌహీద్ జమాత్ పేలుళ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, ఈ మేరకు ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు.


    9:53 (IST)

    శ్రీలంకలో పేలుళ్లలో ఆరుగురు భారతీయుల మృతి

    శ్రీలంక పేలుళ్లలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందగా.. ఇందులో ఆరుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు ఆదివారం సాయంత్రం వెల్లడించగా.. సోమవారానికి ఆ సంఖ్య 6కిపెరిగింది. విదేశీ మృతుల్లో అమెరికన్లు, జపనీస్, చైనీస్, పోర్చుగీస్, డెన్మార్క్ సహా పలు దేశాలకు చెందినవారు ఉన్నారు.

    క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రాజధాని కొలంబో సహా... 8 చోట్ల (మూడు చర్చిలు, మూడు హోటళ్లు) వరుస బాంబు పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో జరిగిన శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 290 మంది చనిపోగా... 500 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉండగా.. ఇందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. పేలుళ్లలో కొచ్చికడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా ధ్వంసమయ్యాయి. చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు. చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు... చెల్లా చెదురుగా పరుగులు తీశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. పేలుళ్ల ఎఫెక్ట్‌తో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.

    ప్రస్తుతం పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల ప్రాంతాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద రాజపక్షే పరిశీలించారు. అత్యవసరంగా సమావేశమైన శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది.జహారానా, అబూ మహ్మద్ అనే ఇద్దరు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 11 చర్చిలలో బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని శ్రీలంక నిఘా వర్గాలు నాలుగు రోజుల ముందే హెచ్చరించినా, ప్రభుత్వం, పోలీసులు తేలిగ్గా తీసుకున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.