హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: అఫ్గాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి వరకే గడువు.. అప్పటికల్లా తరలింపు సాధ్యమా?

Afghanistan: అఫ్గాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి వరకే గడువు.. అప్పటికల్లా తరలింపు సాధ్యమా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అఫ్గానిస్థాన్ లో ఆగస్టు 31లోగా తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అగ్రరాజ్యం అమెరికా గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే గడువు సమయం దగ్గరికి వస్తుండడంతో అమెరికా తరలింపు ప్రక్రియలో వేగం పెంచింది.

అఫ్గానిస్థాన్ లో తమ బలగాలను ఆగస్టు 31లోగా ఉపసంహరించుకుంటామని అగ్రరాజ్యం అమెరికా గతంలో తెలిపిన విషయం తెలిసిందే. గత 20 ఏళ్లుగా అఫ్గానిస్థాన్ లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా అక్కడ అనేక సైనిక కార్యకలాపాలను నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా చేసింది. అయితే చెప్పినట్లుగా 31లోగా బలగాలు, పౌరులు, శరణార్థులను తరలించడానికి అమెరికా ముందుకు సాగుతోంది. అయితే బలగాల ఉపసంహరణ ముగింపు కోసం కచ్చితమైన తేదీ, టైం ఇంకా నిర్ణయించలేదని అమెరికా తెలిపింది. శరణార్థులు, ఆపదలో ఉన్న వారి తరలింపు పూర్తి కాగానే తమ బలగాలు అమెరికా బయలుదేరుతామని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే కాబుల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా కాబుల్ ఎయిర్పోర్టును స్వాధీనం చేసుకుంటామని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆఫ్గానిస్థాన్ లో ఇటీవల జరిగిన పేలుళ్లు, దీంతో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల్లో పౌరల తరలింపు కష్టతరంగా మారింది. ఇంకా అఫ్గాన్ లో అమెరికాకు చెందిన 300 మంది పౌరులు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ఇప్పటివరకు తమకు సహాయం చేసిన వారిని కూడా తీసుకెళ్తామని అమెరికా చెబుతోంది.

ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం ఆత్మాహుతి దాడులతో కాబుల్‌లో టెర్రరిస్టులు రక్తపుటేరులు పారించిన విషయం తెలిసిందే.  వరుస పేలుళ్లలో దాదాపు 200 మంది మరణించారు. ఐతే ఈ నెత్తుటి గాయాలను మరవక ముందే మరో విధ్వంసానికి ఐసిస్-కే ఉగ్రవాదులు స్కెచ్ చేశారు. కారు నిండా బాంబులు నింపి.. కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఆత్మాహుతి దళ సభ్యులే లక్ష్యంగా అమెరికా ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఐదు ఫైటర్ జెట్లతో బాంబులను జార విడిచింది.

Afghanistan: అఫ్గాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు.. జానపద కళాకారుడి హత్య

ఈ ఘటనలో కారులో ఉన్న టెర్రరిస్టులు మరణించారు. ఎయిర్ స్ట్రైక్స్ ధాటికి వారి వాహనాలు తునాతునకలయ్యాయి. ఆత్మ రక్షణ కోసమే వైమానిక దాడులు చేశామని.. ఈ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోయినట్లుగా సమాచారం లేదని అమెరికా వెల్లడించిది. పక్కా వ్యూహంతో టార్గెట్‌పై ఎయిర్‌స్ట్రైక్స్ చేయడంతో పెను తప్పిందని అభిప్రాయపడ్డారు.

Afghanistan: ఆఫ్గానిస్థాన్ లో ఆందోళనకర పరిస్థితులు.. డబ్బులు లేని బ్యాంకులు.. ప్రజల అవస్థలు

మరోవైపు నిన్న సాయంత్రం కూడా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో రాకెట్ దాడితో విరుచుకుపడ్డారు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులు చేశారు. కానీ అవి గురితప్పి అమెరికా ఎంబసీపై కాకుండా, జనావాసాలపై పడ్డాయి. ఖవాజా భఘ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో.. భారీ పేలుడు సంభవించింది. ఓ చిన్నారి సహా ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

First published:

Tags: America, Joe Biden

ఉత్తమ కథలు