హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Food Crisis : ఆహార సంక్షోభంలోకి ఆ రెండు దేశాలు.. ఇప్పుడు ఏం చేయ‌నున్నాయి

Food Crisis : ఆహార సంక్షోభంలోకి ఆ రెండు దేశాలు.. ఇప్పుడు ఏం చేయ‌నున్నాయి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Food Crisis : అంత‌ర్జాతీయంగా రెండు దేశాలు వివిధ కార‌ణాల ద్వారా ఆహార సంక్షోభం(Financial Crisis) లోకి వెళ్ల‌నున్నాయి. అవే అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan) , ఉత్త‌ర‌కొరియా (North Korea). రెండు దేశాల్లోనూ నిరంకుశ‌ ప్ర‌భుత్వ విధాన‌ల‌తో ఆ దేశాలు ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్తున్నాయి.

ఇంకా చదవండి ...

అంత‌ర్జాతీయంగా రెండు దేశాలు వివిధ కార‌ణాల ద్వారా ఆహార సంక్షోభం(Financial Crisis) లోకి వెళ్ల‌నున్నాయి. అవే అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan) , ఉత్త‌ర‌కొరియా (North Korea). రెండు దేశాల్లోనూ నిరంకుశ‌ ప్ర‌భుత్వ విధాన‌ల‌తో ఆ దేశాలు ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్తున్నాయి. తాలిబ‌న్ల (Taliban) తిరుగుబాటు.. ప్ర‌భుత్వ ఏర్పాటుతో అఫ్ఘ‌నిస్తాన్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌డం లేదు. దీంతో ప్రపంచ వ్యా ప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన ఆఫ్ఘ‌నిస్తాన్ డ‌బ్బుల‌ను ఆయా బ్యాంకులు తీసుకొనే హ‌క్కును నిలుపుదల చేశాయి. దీంతో అఫ్ఘ‌న్‌లో ఆర్థిక సంక్షోభం (Financial Crisis) ఏర్ప‌డే ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆహారం, న‌గ‌దు నిల్వ‌లు లేక అఫ్ఘ‌నిస్తాన్ ఆర్థిక, ఆహార‌ సంక్షోభంలో ప‌డింది. దేశీయ బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పూర్తిగా క్షీణ ద‌శ‌కు చేరుకొన్నాయి. ఏటీఎం (ATM)లో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌గుద అంద‌డం లేదు.

ఇక ఉత్త‌ర కొరియాకు వ‌స్తే నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (Kim Jong un) పాలన లోపాల కార‌ణంగా ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మొదలైనప్పుడు ఆ దేశం ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది. వాటిని ఇంకా కొన‌సాగిస్తోంది. సరిహద్దులను మూసి వేసింది.

Covid 19 Deaths : వామ్మో ఇంతమందా.. క‌రోనాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్ని ల‌క్ష‌ల మంది చ‌నిపోయారో తెలుసా?


ప్యాంగ్యాంగ్‌ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించిది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ఈ ఏడాది 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

విజ్ఞ‌ప్తులు చేస్తున్న తాలిబ‌న్లు..

అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ (Federal Bank), యూరప్‌ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవ‌డానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని అంత‌ర్జాతీయ స‌మాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుద‌ల కొన‌సాగుతుంద‌ని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్ప‌డు ఆర్థిక‌, ఆహార సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆయా దేశాల‌ను కోరుతోంది. అంత‌ర్జాతీయ స‌మాజం ఒప్పుకొనేలా అన్ని చ‌ర్య‌లుతీసుకొంటామ‌ని విజ్ఞ‌ప్తులు చేస్తోంది అఫ్గ‌నిస్థాన్‌.

నలహంసలను తినాలంటూ జనాలను కిమ్ సూచ‌న‌..

ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి దేశంలో ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాడు కిమ్‌. ఉత్త‌ర కొరియా తూర్పు తీరంలోని క్వాంగ్‌ఫో డక్ ఫామ్‌లో, ఉత్తర కొరియా ప్రావిన్స్‌లోని సౌత్ హమ్‌గ్‌యాంగ్‌లో పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియా (Media)లో ప్రసారం అయ్యింది. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియా (National Media) లో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. చూడాలి కిమ్ చ‌ర్య‌లు ఆదేశాన్ని ఆహార సంక్ష‌భం నుంచి బ‌య‌ట ప‌డేస్థాయో లేదో..

First published:

Tags: Afghanistan, Food, International news, North Korea

ఉత్తమ కథలు