ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి

ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు మహిళా జడ్జిల మీద దుండుగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఈ దారుణం జరిగింది. వారు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్టు కోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫామిమ్ క్వావీమ్ తెలిపారు.

 • Share this:
  ఇద్దరు మహిళా జడ్జిల మీద దుండుగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఈ దారుణం జరిగింది. వారు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్టు కోర్టు అధికార ప్రతినిధి అహ్మద్ ఫామిమ్ క్వావీమ్ తెలిపారు. ఈ దారుణాకి పాల్పడింది తామేననే విషయాన్ని ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు. తాలిబన్ ఆయుధాల గ్రూప్ జైబుల్లా ముజాహిద్ మాత్రం దాంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం, తాలిబన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే అఫ్ఘనిస్తాన్‌లో హింస వెలుగుచూస్తోంది. మరీ ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల అఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలను 2500కు తగ్గిస్తామంటూ అగ్రరాజ్యం ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

  సుప్రీంకోర్టులో 200 మందికి పైగా మహిళా జడ్జిలు పనిచేస్తున్నట్టు అహ్మద్ ఫామిమ్ క్వావీమ్ చెప్పారు. 2017 ఫిబ్రవరిలో కూడా ఆఫ్ఘాన్ సుప్రీంకోర్టు మీద సూసైడ్ బాంబ్ ఎటాక్ జరిగింది. కారుతో సూసైడ్ బాంబర్ ఎటాక్ చేశాడు. ఈ దాడిలో 20 మంది చనిపోయారు. 41 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా కొందరు ప్రముఖులైన అప్ఘన్ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, డాక్టర్లు, న్యాయవాడుల మీద దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. కాబూల్‌ సహా ఇతర ప్రాంతాల్లో పట్టపగలే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ దాడులు అన్నిటికీ తాలిబన్లు కారణమని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, తాలిబన్లు వాటిని తోసిపుచ్చుతున్నారు. వీటిలో కొన్ని దాడులను తామే చేసినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఈ నెల ఆరంభంలోనే అప్ఘాన్‌లో జరుగుతున్న దాడులను గురించి మాట్లాడిన అమెరికా తొలిసారి తాలిబన్లే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.

  ‘శాంతి నెలకొనాలంటే ప్రభుత్వ అధికారులు, సామాజిక ఉద్యమాకరులు, జర్నలిస్టులను హత్యలు చేస్తూ తాలిబన్లు సాగిస్తున్న ప్రచారాన్ని ఆపాలి.’ అని అఫ్ఘన్‌లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి కల్నల్ సన్నీ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

  అక్టోబర్‌లో ముష్కరుల దాడిలో అంపైర్ మృతి
  2020 అక్టోబర్‌లో ముష్కరుల దాడిలో ఓ క్రికెట్ అంపైర్ చనిపోయారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. పేలుడు ధాటికి భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 30 మందికి గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఉగ్రవాదులతో తుపాకులతో గవర్నర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే వారిని గవర్నర్ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది కాల్చిచంపారు. మృతుల్లో క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: