హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump Twitter: ట్విట్టర్‌కు పోటీగా కొత్త ప్లాట్‌ఫాంను ప్రారంభించిన ట్రంప్.. అందులో ఆయనకు మాత్రమే అకౌంట్

Donald Trump Twitter: ట్విట్టర్‌కు పోటీగా కొత్త ప్లాట్‌ఫాంను ప్రారంభించిన ట్రంప్.. అందులో ఆయనకు మాత్రమే అకౌంట్

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. బ్లాగ్‌లా కనిపిస్తున్న ఈ కొత్త సోషల్ మీడియా పేజీ... ట్రంప్‌ అధికారిక వెబ్‌?

  అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ సంస్థలు డోనాల్డ్ ట్రంప్ అకౌంట్లను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని నెలలుగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. బ్లాగ్‌లా కనిపిస్తున్న ఈ కొత్త సోషల్ మీడియా పేజీ... ట్రంప్‌ అధికారిక వెబ్‌సైట్‌లో భాగంగానే ఉంది. ఇందులో ఆయన మాత్రమే పోస్టులు చేస్తుంటారు. ఇతరులు వీటిని చూడటం మాత్రమే సాధ్యమవుతుంది. మరీ నచ్చితే వాటిని అక్కణ్నుంచి మీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ అకౌంట్లకు షేర్‌ చేసుకోవచ్చు. లైక్‌ కూడా కొట్టవచ్చు. అయితే ఈ ట్విట్టర్‌ ఆప్షన్‌ ఇప్పుడు ఇంకా పని చేయడం లేదు. ఏదో సమస్య ఉందని, దీన్ని త్వరలో ఫిక్స్‌ చేసి అందుబాటులోకి తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. ట్రంప్‌ తన సోషల్‌ మీడియాకి ‘ఫ్రమ్‌ ది డెస్క్‌ ఆఫ్‌ డొనాల్డ్‌ జూ. ట్రంప్‌’ అని పేరు పెట్టారు. ట్రంప్‌ చెప్పే మాటలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే ఈ పేజీలో సైనప్‌ అవ్వాలి. అప్పుడు యూట్యూబ్‌ నోటిఫికేషన్లు వచ్చినట్లు ఇవి కూడా మీకు వచ్చేస్తాయి.

  అయితే ఇక్కడే మీకో డౌట్‌ రావొచ్చు. ట్రంప్‌ అసలే రకరకాల పోస్టులు పెడుతుంటాడు. మరి షేర్‌ చేస్తే ఫేస్‌బుక్‌, ట్విటర్‌ (త్వరలో) ఊరుకుంటాయా అని? అయితే నిబంధనలు, మార్గదర్శకాలకు తగ్గట్టుగా ఉంటేనే ఆ పోస్టుల్ని సోషల్‌ మీడియాలు ఉంచుతాయి. కాబట్టి ట్రంప్‌ రాసే ఎన్ని పోస్టులు ఉంటాయో లేదో చెప్పలేం. ట్రంప్‌ ఈ పేజీ అధికారికంగా మంగళవారమే లాంచ్‌ చేసినా... అందులో మార్చి 24 నుంచి పోస్టులున్నాయి. ఈ పేజీ ద్వారా ట్రంప్‌ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారట. అదెలా అనేది మాత్రం చెప్పలేదు. దీనిపై మరో పోస్టులో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

  ఇక ట్రంప్‌ మీద ఫేస్‌బుక్‌ విధించిన బ్యాన్‌ను పునర్‌పరిశీలిస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఈ రోజు లేదా రేపు దీనిపై ప్రకటన రావొచ్చు. ట్విట్టర్‌ అయితే ట్రంప్‌ మీద శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్టు తేల్చి చెప్పేసింది. యూట్యూబ్‌ ఛానల్ విషయంలోనూ గూగుల్‌ క్లారిటీ ఇచ్చేసింది. వీడియోల్లో వయలెన్స్‌ తగ్గితే అప్పుడు ఆ ఛానల్‌ను తిరిగి లైవ్‌ లోకి తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తామని చెప్పింది.

  First published:

  Tags: Donald trump, Twitter

  ఉత్తమ కథలు