క్రిస్మస్ ట్రీకి తన కరెంట్ ఇచ్చి వెలిగిస్తున్న ఈల్ చేప... వైరల్ వీడియో

Electric Eel : ఎలక్ట్రిక్ ఈల్ చేపకు కరెంట్ ఉంటుందని మనకు తెలుసు. ఆ కరెంటుతో క్రిస్మస్ ట్రీకి ఏర్పాటు చేసిన లైట్లు వెలగడం విశేషం. అదెలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 8, 2019, 12:16 PM IST
క్రిస్మస్ ట్రీకి తన కరెంట్ ఇచ్చి వెలిగిస్తున్న ఈల్ చేప... వైరల్ వీడియో
ఈల్ చేపతో కరెంటు (credit - insta - Miguel Wattson TNAQ)
  • Share this:
అమెరికా... టెన్నెస్సీలోని చత్తనూగాలో ఓ ఆక్వారియం ఉంది. అందులో ఈల్ మిగ్యూల్ మాట్సన్ ఉంది. దాని దగ్గర ఓ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఆ ట్రీకి లైట్స్ ఏర్పాటుచేసి... అక్కడి నుంచీ కరెంటు వైర్లను ఆక్వేరియంలోకి సెట్ చేశారు. కరెంటును కలిగివుండే ఆ ఈల్ చేప అప్పుడప్పుడూ బయో ఎలక్ట్రిసిటీని రిలీజ్ చేస్తోంది. అలా రిలీజ్ చేసినప్పుడు... ఆ కరెంటు... వైర్ల సిస్టం ద్వారా... క్రిస్మస్ ట్రీకి ఏర్పాటు చేసిన లైట్లను చేరుతోంది. దాంతో లైట్లు వెలుగుతున్నాయి. త్వరలో క్రిస్మస్ పండుగ వస్తున్న సమయంలో... ఈ ఆక్వేరియం అందర్నీ ఆకర్షిస్తోంది. మామూలుగా కరెంటు వైర్లు ఆక్వేరియంలో పెట్టేస్తే లైట్లు వెలిగిపోవట్లేదు. దానికి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఇలా లైట్లు వెలుగుతుంటే చూడటానికి ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అందుకే ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోని ఇప్పటికే 37వేల మంది చూశారు. లైక్సూ, కామెంట్లూ వస్తూనే ఉన్నాయి. మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

 

వెంకీ మామ బ్యూటీ రాశీ ఖన్నా క్యూట్ పిక్స్


ఇవి కూడా చదవండి :

బట్టలు ఉతికిన చింపాంజీ... వైరల్ వీడియో...

తొలిసారి అమ్మమాటలు విన్న చిన్నారి రియాక్షన్ ఇదీ... వైరల్ వీడియో

FD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...

పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు