హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Election 2020: తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అకౌంట్లను తొలగించిన ట్విట్టర్, ఫేస్‌బుక్

US Election 2020: తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అకౌంట్లను తొలగించిన ట్విట్టర్, ఫేస్‌బుక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US Election 2020 | ఇక వోటింగ్ మోసాలు, ఆలస్యానికి సంబంధించి రోజంతా సర్క్యులేట్ అయిన తప్పుడు సమాచారంపైనా ఈ సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకున్నాయి.

అమెరికా ఎన్నికలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పలు అకౌంట్లను ట్విట్టర్, ఫేస్‌బుక్ తొలగించింది. అవి తమ పాలసీను ఉల్లంఘిస్తున్నాయని ఈ రెండు సోషల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ట్విట్టర్ తొలగించిన అకౌంట్లలో SVNewsAlerts కూడా ఉంది. ఈ అకౌంట్‌కు 78,000 పైగా ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్నారు. వీరిలో 10,000 ఫాలోయర్స్ గత వారంలో యాడ్ అయ్యారు. ఓటింగ్ భద్రత, విశ్వసనీయతకు సంబంధించిన అంశాలను హైలైట్ చేయడంతో పాటు, ఎన్నికలకు సంబంధించిన అశాంతి గురించి తరచూ పోస్టులు చేస్తుండటంతో ఈ అకౌంట్‌కు పలుమార్లు ట్విట్టర్ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. డెమోక్రాట్ల విషయంలో తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ర్యాలీలు, ప్రసంగాలపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు తేలింది. ట్విట్టర్ సస్పెండ్ చేసిన అకౌంట్లలో FJNewsReporter, Crisis_Intel, Faytuks లాంటివి ఉన్నాయి.

Bank of Baroda కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆ ఛార్జీలు రద్దు

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం

ఇక ఫేస్‌బుక్ కూడా పలు అకౌంట్లను తొలగించింది. అందులో SV News, FJ News లాంటివి ఉన్నాయి. SV News ఫేస్‌బుక్ పేజీకి 20,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ సస్పెండ్ చేసిన అకౌంట్లలో కొన్నింటిన రష్యా మీడియా ఫాలో అవుతున్నట్టు తేలింది. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. SVNewsAlerts, Faytuks అకౌంట్లకు కేవలం 11,000 మంది ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు. రష్యా ప్రభుత్వానికి మీడియా సంస్థలు స్పుత్నిక్, ఆర్‌టీ వార్తల్లో పదులసార్లు SVNewsAlerts, Faytuks ట్వీట్స్‌ని ఉదహరించినట్టు పరిశోధకులు Chris Scott గుర్తించడంతో పాటు రాయిటర్స్ ధృవీకరించింది.

Business Loan: వ్యాపారానికి అప్పు కావాలా? మోదీ ప్రభుత్వ పథకానికి నవంబర్ 30 లోగా అప్లై చేయండి

EPFO: వాట్సప్‌లో ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్... హైదరాబాద్, విజయవాడ నెంబర్స్ ఇవే

ఇక వోటింగ్ మోసాలు, ఆలస్యానికి సంబంధించి రోజంతా సర్క్యులేట్ అయిన తప్పుడు సమాచారంపైనా ఈ సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. అంతేకాదు అధికారిక రిపబ్లికన్ అకౌంట్లు, ఆన్‌లైన్ పబ్లికేషన్స్‌కి సహకారం అందించాయి. ఇక #StopTheSteal హ్యాష్‌ట్యాగ్‌తో @PhillyGOP అకౌంట్‌ నుంచి పోస్ట్ చేసిన పలు ట్వీట్లకు ఫ్యాక్ట్ చెకింగ్ లేబుల్స్ వేసింది ట్విట్టర్. దీనిపై ఫిలాడెల్ఫియా రిపబ్లికన్ పార్టీ స్పందించలేదు. #StopTheSteal హ్యాష్‌ట్యాగ్‌తో 15 నిమిషాల్లో 2,000 పైగా మెన్షన్స్ ఉన్నట్టు తేలింది. ఇక రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్స్ మూసివేసినట్టు, భారీ క్యూలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై ట్విట్టర్‌లో 33,000 మెన్షన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇలా అనేక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అకౌంట్లపై ట్విట్టర్, ఫేస్‌బుక్ నిఘా పెట్టింది.

First published:

Tags: America, Donald trump, Facebook, Joe Biden, Trump, Twitter, US Elections 2020, USA

ఉత్తమ కథలు