Home /News /international /

TWIN EARTHQUAKES HITS WESTERN AFGHANISTAN KILL AT LEAST 26 PEOPLE FIRST CALAMITY IN TALIBAN REGIME MKS

Afghanistan Earthquake: అఫ్గాన్‌లో భూకంపం.. 26 మంది మృతి.. Taliban పాలనలో తొలి విలయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అఫ్గానిస్థాన్ ను వరుస భూకంపాలు కుదిపేశాయి. పశ్చిమ అఫ్గాన్ లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో ప్రకంపనలకు పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలి 26 మంది చనిపోయారు. తాలిబన్ పాలనలో చోటుచేసుకున్న తొలి ప్రకృతి విలయం ఇదే..

ఆసియా దేశం అఫ్గానిస్థాన్ లో భూకంప విలయం చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్గాన్ లో వరుస భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ అఫ్గాన్ లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందైనట్టు యూఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. బాద్ఘీస్ పశ్చిమ ప్రావిన్సు పరిధిలోని క్వాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ చెప్పారు.

అఫ్గాన్ భూకంప మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 26 మంది ఉన్నారని తాలిబన్ ప్రతినిధి చెప్పారు. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా, శిథిలాల కింద వేల మంది చిక్కుకుకుపోయారు. అందుబాటులో ఉన్న యంత్రాలు, యంత్రాంగంతో సహాయక కార్యక్రమాలు చేపట్టామని తాలిబన్ సర్కారు పేర్కొంది. కాగా, తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న అఫ్గాన్ ఎదుర్కొన్న తొలి ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం.

Covid చికిత్సలో కేంద్రం సంచలనం: మళ్లీ రెమ్‌డెసివీర్‌కు చోటు.. తీవ్రతను బట్టి వాడాల్సిన మందులివే


పశ్చిమ అప్గాన్ లోని క్వాదీస్ ప్రాంతం గత 20 ఏళ్లుగా తీవ్ర కరవు పరిస్థితులతో అల్లాడుతోంది. కరవు కరాళ నృత్యం చేస్తున్న క్వాదీస్ ప్రాంతంలోని హిందూ కుష్ పర్వత రేంజ్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015వ సంవత్సరంలో సంభవించిన భూకంపంలో 280 మంది మరణించారు. తాజా ఘటనలోనూ మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Afghanistan, Earthquake, Taliban

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు