మొసలితో తాబేలు హై-ఫై... డ్రగ్ డీల్ అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో

జనరల్‌గా ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అసలే మొసలి. పైగా నీటిలో ఉంది. అలాంటి దానితో హై-ఫై అంటే ప్రమాదమే. మరి ఇది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది?

news18-telugu
Updated: September 7, 2020, 9:38 AM IST
మొసలితో తాబేలు హై-ఫై... డ్రగ్ డీల్ అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో
మొసలితో తాబేలు హై-ఫై... (credit - twitter)
  • Share this:
కరోనా కాలం కావడంతో... ఈమధ్య వైల్డ్ లైఫ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో వీటిని చూస్తూ... షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ బుల్లి తాబేలు... ఓ పెద్ద మొసలితో హై-ఫై చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ట్విట్టర్‌లో గేటర్స్ డైలీ... ఈ వీడియోని షేర్ చేసింది. ఈ పేజ్‌లో తరచుగా ఇలాంటి వీడియోలు వస్తున్నాయి. తాజా వీడియోలో... మొసలి కదలకుండా... నీటిపై తేలుతూ ఉండగా... అటుగా వచ్చిన బుల్లి తాబేలు... మొసలి కాలిని తన ముందు కాలుతో టచ్ చేసి... హై-ఫైవ్ చేసింది. ఆ తర్వాత అలా వెళ్లిపోయింది. దీనికి మొసలి ప్రశాంతంగా రియాక్ట్ అయ్యింది. బుల్లి తాబేలును ఏమీ అనలేదు. అందువల్ల ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. ఇప్పటికే దీనికి 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ అన్‌లక్కీ ఫ్రెండ్షిప్ చూసి... ఇంప్రెస్ అవుతున్నారు.


ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల నెటిజన్లు ఈ వీడియోని ఎన్నికలతో లింక్ పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులైన నేతలు... పైకి శత్రువుల్లా ఉంటూ... తెరవెనక డీల్స్ కుదుర్చుకుంటారు. ఇదీ అలాగే ఉంది అంటున్నారు నెటిజన్లు. వాటి మధ్య డ్రగ్ డీల్ కుదిరిందా అని బాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


కరోనా సమయంలో ఇలాంటి జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని అప్‌లోడ్ చేస్తున్నారు. జంతువుల ప్రపంచంలో మనకు తెలియని విశేషాలు చాలా ఉంటాయి. అలాంటివి ఇప్పుడు తెలుసుకునే ఛాన్స్ లభిస్తోంది. చాలా మంది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు... తమ అరుదైన ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ... నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 7, 2020, 9:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading