హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Man Digs: రెండు రోజులుగా ఆ ఒక్కడే శిథిలాలు తవ్వుతున్నాడు! హృదయాలను మెలిపెడుతున్న శవాల గుట్టలు

Man Digs: రెండు రోజులుగా ఆ ఒక్కడే శిథిలాలు తవ్వుతున్నాడు! హృదయాలను మెలిపెడుతున్న శవాల గుట్టలు

సిరియాలో సహాయక చర్యలు (Source AFP)

సిరియాలో సహాయక చర్యలు (Source AFP)

Man Digs: టర్కీ, సిరియాల్లో పెను విధ్వంసం సృష్టించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. శిథిలాల కింద నరకయాతనతో తనువు చాలిస్తున్నారు ప్రజలు. దీంతో ఎక్కడ చూసినా శ్మశాన వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసిన హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టర్కీ (turkey), సిరియా(syria)ల్లో సంభవించిన పెను భూకంపం(earthquake) తీరని విషాదాన్ని నింపుతోంది. వేలాది మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. తమ కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నంలో కుటుంబసభ్యులు దేనికైనా సాహసిస్తున్నారు. హృదయాలను మెలిపెడుతున్న ఈ ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. సిరియాలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం ఓ యువకుడు చేసిన ప్రయత్నం కన్నీరు పెట్టిస్తోంది.

రెండు రోజులుగా శిథిలాలు తవ్వుతున్న ఇబ్రహీం:

సిరియాలో భూకంపం తర్వాత మలేక్ ఇబ్రహీం అనే యువకుడు తన ఇంటి నుంచి కష్టపడి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే తన కుటుంబసభ్యులు మాత్రం శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుసుకున్నాడు. అప్పటికే ఇంకా సహాయక సిబ్బంది రానే లేదు. రెబెల్స్‌ ఆధీనంలో ఈ ప్రాంతంలో రెస్క్యూ చాలా లేట్‌గా ప్రారంభమైంది. తన కుటుంబానికి చెందిన 30మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని అర్థం చేసుకున్నాడు. శిథిలాలను తవ్వడానికి చేతిలో ఏ ఆయుధమూ లేదు. దీంతో చేతితోనే శిథిలాలు తవ్వడం మొదలుపెట్డాడు. చాలా సేపటి తర్వాత అక్కడికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. ఇబ్రహీంకు సాయం చేయడం ప్రారంభించారు. రెండు రోజులుగా ఇబ్రహీం శిథిలాలు తవ్వుతూనే ఉన్నాడు. 30మందిలో ఇప్పటివరకు 10మంది కుటుంబసభ్యుల మృతదేహాలు బయటకు తీశారు. విగత జీవులగా మారిన తన కుటుంబసభ్యులను చూస్తున్న ఇబ్రహీం కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. ఇంకా మిగిలిన 20మందిలో ఎవరైనా బతికి ఉంటారేమోనన్న అతని ఆశ ఇంకా చావలేదు. వారిని బతికించడం కోసం ఏడుపు ఆపుకుంటూనే.. శిథిలాలను తవ్వుతున్న ఇబ్రహీం దుస్థితిని చూసి అక్కడున్నవాళ్లు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య:

గడ్డకట్టే వాతావరణంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఇప్పటివరకు భూకంపం మృతుల సంఖ్య 15వేలు దాటింది. భూకంపం కారణంగా టర్కీలో ఇప్పటివరకు 12 వేల 391 మంది, సిరియాలో 2 వేల 992 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మృతుల సంఖ్య(death toll) మరింత పెరిగే అవకాశముంది. శిథిలాల కింద ఇంకా వేల సంఖ్యలో బాధితులు చిక్కుకున్నారని సమాచారం. మృతుల సంఖ్య 20వేలు దాటొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా వేస్తోంది. ఈ భూకంపం వల్ల మొత్తం 8.5 కోట్ల టర్కీ జనాభాలో 1.3 కోట్ల మంది ప్రభావితులయ్యారని అధ్యక్షుడు ఎర్డోగన్​ తెలిపారు.

First published:

Tags: Earth quake, Turkey

ఉత్తమ కథలు