హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Turkey Earthquake : టర్కీ భూకంపాల్లో 3,800 మంది మృతి .. అప్‌డేట్స్

Turkey Earthquake : టర్కీ భూకంపాల్లో 3,800 మంది మృతి .. అప్‌డేట్స్

భూకంపం మిగిల్చిన విషాదం (image credit - twitter - @kci2013)

భూకంపం మిగిల్చిన విషాదం (image credit - twitter - @kci2013)

Earthquake in Turkey : టర్కీ, సినియా భూకంపాల్లో మృతుల సంఖ్య ఊహించలేని విధంగా పెరుగుతోంది. నిన్న మూడు భారీ భూకంపాలు రావడంతో టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Turkey earthquake updates : ఎక్కడో భూమి లోపల 18 కిలోమీటర్ల లోతున ఓ భారీ కదలిక.. వేల మంది ప్రాణాలు తీస్తోంది. లక్షల మందిని నిరాశ్రయులను చేస్తోంది. మొన్నటివరకూ ఒకలా ఉన్న ప్రదేశం... నిన్న తెల్లారకముందే శ్మశానంలా మారిపోయింది. మరభూమిని తలపిస్తోంది. టర్కీకి ఆగ్నేయంగా... సిరియాకి ఉత్తరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో నిన్న గంటల గ్యాప్‌లో వచ్చిన 3 భూకంపాలు... ఆ రెండు దేశాలనూ అల్లకల్లోలం చేశాయి.

ఈ భూకంపాల వల్ల టర్కీలో దాదాపు 2,500 మంది దాకా మరణించగా.. సిరియాలో 1500 మంది దాకా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మరణాలకు సంబంధించి కచ్చితమైన లెక్కలు రావట్లేదు. 3,800 మంది మాత్రం కచ్చితంగా చనిపోయారని అంటున్నారు.

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కల ఆస్పత్రులన్నీ గాయపడిన వేలమందితో నిండిపోయాయి. 3వేలకు పైగా ఇళ్లు, భవనాలూ కూలిపోవడంతో... నిన్నటి నుంచి కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడి వాతావరణం సరిగా లేదు. చల్లటి వాతావరణం ఇబ్బంది పెడుతోంది. విపరీతంగా శిథిలాలు ఉండటంతో వాటి కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్క లేదు. మరణాల సంఖ్య పెరగవచ్చనే అంచనా ఉంది.

నిన్న తెల్లవారు జామున 4 గంటల సమయంలో మొదటి భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం టర్కీకి ఆగ్నేయంగా ఉన్న నర్దాగి (Nurdagi)లో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే (USGS) గుర్తించింది. ఆ తర్వాత మరో రెండు భారీ భూకంపాలు వచ్చాయి. ఫలితంగా టర్కీతోపాటూ... సిరియాలోనూ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి.

నిన్నటి నుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రళయం ఇక్కడితో ఆగుతుందా.. మరిన్ని భూకంపాలు వస్తాయా అనేది తెలియట్లేదు. భారత్ సహా ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సాయం అందిస్తున్నాయి. టర్కీ ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. భూమి లోపల పలకాలు కంటిన్యూగా కదులుతూనే ఉంటాయనీ.. అవి సర్దుబాటు చేసుకునే సమయంలో.. ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Earth quake, Earthquake, Turkey

ఉత్తమ కథలు