2004 డిసెంబర్ 26: సునామీ విలయ తాండవాన్ని మర్చిపోగలమా?

ఇండొనేసియాకు సునామీలు కొత్తేమీ కాదు. అక్కడ తరచూ భూకంపాలూ, సునామీలూ వస్తూనే ఉంటాయి. అయినా సరే ఆ దేశం ఎందుకు సన్నద్ధం కాలేకపోతోంది. 14 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు ఫెయిలవుతోంది? ఈ విషయంలో భారత్ పరిస్థితేంటి? సునామీలపై మనం ముందుగానే అప్రమత్తం అవ్వగలమా?

Krishna Kumar N | news18-telugu
Updated: December 26, 2018, 9:38 AM IST
2004 డిసెంబర్ 26: సునామీ విలయ తాండవాన్ని మర్చిపోగలమా?
ఇండొనేసియాలో తాజా సునామీ (పైల్ ఫొటో)
  • Share this:
సరిగ్గా 14 ఏళ్ల కిందట రాక్షస అలలు లక్షల మందిని మింగేశాయి. 2004 డిసెంబరు 26న ఇండొనేసియాలోని సుమత్రా తీరంలో ఒక్కసారిగా భారీ కుదుపు. 9.3 తీవ్రతతో హిందూ మహా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం ప్రళయాన్ని తలపించింది. దాని ఉద్ధృతితో ఒక్కసారిగా విరుచుకుపడిన సునామీ పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ భూకంపం ధాటికి 23 వేల ‘హిరోషిమా’ తరహా అణుబాంబులు పేలినంత శక్తి విడుదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారంటే అది ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. భూకంప కేంద్రం నుంచి సముద్రంలో మొదలైన రాకాసి అలలు సునామీలా దూసుకొచ్చి... భారత్ సహా 14 దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. సునామీ విలయంలో 2.28 లక్షల మంది మృత్యువాత పడగా.. ఒక్క ఇండొనేసియాలోనే 1.68 లక్షల మంది చనిపోయారు.హిందూ మహా సముద్రంలో ఏం జరిగింది?
భారత భూ భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టోనిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. వాటి ఫలితంగా సముద్ర అలలు దాదాపు 100 అడుగుల మీటర్ల ఎత్తువరకు ఎగిరి పడి తీర ప్రాంతాల్ని ముంచేశాయి. ఈ విపత్తు వల్ల ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. సిస్మోగ్రాఫ్‌పై రికార్డైన మూడో అతి పెద్ద భూకంపం ఇదే. దీని వల్ల భూ గ్రహం మొత్తం ఒక సెంటీమీటరు వణికింది.
tsunami, tsunami anyer, tsunami banten, indonesia tsunami, tsunami indonesia, tsunami selat sunda, tsunamis, sunami, indonesia volcano tsunami, japan tsunami, giant tsunami, tsunami anyer 2018, tsunami in indonesia, tsunami anyer banten, tsunami (disaster type), tsunami di selat sunda, indonesia tsunami news, indonesia tsunami live, #tsunami, tusunami, tsnami, tunami, mega tsunami, tsunami 2018, tsunami news, huge tsunami, tsunami aceh, tsunami palu, tsunami, 2004 indian ocean earthquake and tsunami (disaster), tsunami 2004, tsunami (disaster type), tsunami aceh 2004, tsunamis, tsunami sri lanka, giant tsunami, tsunami sumatra 2004, 2004 indian ocean earthquake and tsunami, 2004 indian ocean tsunam footage, thailand tsunami 2004, detik tsunami aceh 2004, tsunami indonesia 2004, tsunami di aceh 2004 asli, tsunami in malaysia 26 12 2004, tusunami, ఇండొనేసియా సునామీ, 2004 ఇండొనేసియా సునామీ,
ఇండొనేసియాలో తాజా సునామీ (పైల్ ఫొటో)

14 ఏళ్ల తర్వాత కూడా సునామీ విషాదం:
అప్పటి సునామీ మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని మరచిపోకముందే... 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సునామీ ఇండొనేసియాను కకావికలం చేసింది. తాజా సునామీలో ఇప్పటికే రెండు వందల మందికి పైగా చనిపోగా, మరో 8 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజా సునామీ రావడానికి కారణం గత శనివారం రాత్రి 9.30కి ఇండొనేసియా సండా స్ట్రెయిట్ సముద్ర తీరంలోని అగ్ని పర్వతం బద్ధలవ్వడమే. దాని ధాటికి దూసుకొచ్చిన సునామీ... 500 వందలకు పైగా ఇళ్లను ధ్వంసం చేసింది. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. 14 ఏళ్ల నాటి విషాదాన్ని తలచుకుంటూ... సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇండొనేసియా అధికారులు.

tsunami, tsunami anyer, tsunami banten, indonesia tsunami, tsunami indonesia, tsunami selat sunda, tsunamis, sunami, indonesia volcano tsunami, japan tsunami, giant tsunami, tsunami anyer 2018, tsunami in indonesia, tsunami anyer banten, tsunami (disaster type), tsunami di selat sunda, indonesia tsunami news, indonesia tsunami live, #tsunami, tusunami, tsnami, tunami, mega tsunami, tsunami 2018, tsunami news, huge tsunami, tsunami aceh, tsunami palu, tsunami, 2004 indian ocean earthquake and tsunami (disaster), tsunami 2004, tsunami (disaster type), tsunami aceh 2004, tsunamis, tsunami sri lanka, giant tsunami, tsunami sumatra 2004, 2004 indian ocean earthquake and tsunami, 2004 indian ocean tsunam footage, thailand tsunami 2004, detik tsunami aceh 2004, tsunami indonesia 2004, tsunami di aceh 2004 asli, tsunami in malaysia 26 12 2004, tusunami, ఇండొనేసియా సునామీ, 2004 ఇండొనేసియా సునామీ,
ఇండొనేసియాలో తాజా సునామీ (పైల్ ఫొటో)

ప్రస్తుతం భారత్ పరిస్థితేంటి?
సునామీలను ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సునామీలను ముందుగా పసిగట్టే టెక్నాలజీ భారత్‌ దగ్గర ఉందంటున్నారు హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌లో ఉన్న సునామీ హెచ్చరిక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అజయ్‌కుమార్‌. మన దేశంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో సునామీ వేగాన్ని, దిశను, అది తాకే ప్రాంతాల్నీ గుర్తించవచ్చని తెలిపారాయన. తాజాగా ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిన కాసేపటికే సునామీ వచ్చిందన్న విషయాన్ని తాగు గుర్తించామన్న ఆయన... ఇన్‌కాయిస్‌లోని మానిటరింగ్‌ రూంలో సముద్రపు అలలు సాధారణంగా కన్నా 90 సెం.మీ ఎత్తులో ఎగిసిపడినట్లు గుర్తించామన్నారు.

tsunami, tsunami anyer, tsunami banten, indonesia tsunami, tsunami indonesia, tsunami selat sunda, tsunamis, sunami, indonesia volcano tsunami, japan tsunami, giant tsunami, tsunami anyer 2018, tsunami in indonesia, tsunami anyer banten, tsunami (disaster type), tsunami di selat sunda, indonesia tsunami news, indonesia tsunami live, #tsunami, tusunami, tsnami, tunami, mega tsunami, tsunami 2018, tsunami news, huge tsunami, tsunami aceh, tsunami palu, tsunami, 2004 indian ocean earthquake and tsunami (disaster), tsunami 2004, tsunami (disaster type), tsunami aceh 2004, tsunamis, tsunami sri lanka, giant tsunami, tsunami sumatra 2004, 2004 indian ocean earthquake and tsunami, 2004 indian ocean tsunam footage, thailand tsunami 2004, detik tsunami aceh 2004, tsunami indonesia 2004, tsunami di aceh 2004 asli, tsunami in malaysia 26 12 2004, tusunami, ఇండొనేసియా సునామీ, 2004 ఇండొనేసియా సునామీ,
ఇండొనేసియాలో తాజా సునామీ సహాయ కార్యక్రమాలు (పైల్ ఫొటో)

సునామీలను ఎలా గుర్తిస్తారు?
ప్రపంచంలో ఎక్కడ భూకంపం వచ్చినా భారత్‌కు చెందిన అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు గుర్తిస్తాయి. భూకంపం రాగానే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోయెస్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఈ బోయెస్‌... క్షణక్షణం సముద్ర అలల్లో తేడాల్ని రికార్డు చేస్తాయి. వాటిని ఉపగ్రహాల ద్వారా కంట్రోల్‌ సెంటర్‌కు పంపుతాయి. ఆ సమాచారాన్ని బట్టీ సునామీ వస్తుందా? రాదా అనే విషయాన్ని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రిక్టర్‌ స్కేలుపై 6.5 పాయింట్లు నమోదైతే సునామీ హెచ్చరిక జారీ చేస్తారు.2004లో సునామీ వచ్చిన తర్వాత అలాంటి విపత్తుల్ని పసిగట్టడానికి భారత్ అత్యాధునిక టెక్నాలజీలను వాడటం మొదలుపెట్టింది. హిందూ మహాసముద్రం పరిధిలో 31 దేశాలుంటే భారత్‌, ఆస్ట్రేలియా, ఇండోనేసియాల దగ్గర మాత్రమే సునామీలను పసిగట్టే టెక్నాలజీ ఉంది. సముద్రంలో మార్పుల్ని కనిపెట్టి వాటిలో ఏదైనా తేడా వస్తే వెంటనే చుట్టూ ఉన్న 25 దేశాలకు సమాచారం ఇస్తోంది మన దేశం. ఐతే ఎంత టెక్నాలజీ ఉన్నా... ఇండొనేసియా అధికారులు తాజా సునామీని ముందుగా గుర్తించలేకపోయారు. అప్రమత్తత ఎంతో అవసరమన్న విషయాన్ని ఈ విపత్తులు గుర్తుచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

సామాజిక వేత్త బాబా ఆమ్టే జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

విషాదం...పులి, చిరుత దాడిలో ఇద్దరు చిన్నారులు బలి

శ్రీశైలంలో క్షుద్రపూజలు చేశారా? అర్థరాత్రి ఏం జరిగింది?

Published by: Krishna Kumar N
First published: December 26, 2018, 9:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading