ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలతో జనం బెంబేలు..

ఇండోనేషియాలో ప్రకృతి విపత్తులు తరుచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.2004లో సునామీ అల్లకల్లోలానికి 1,68,000మంది ఇండోనేషియన్లు మృతి చెందారు.

news18-telugu
Updated: July 8, 2019, 7:15 AM IST
ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలతో జనం బెంబేలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండోనేషియాలో మరో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య కోస్తాలోని మలుకు-సులవేసి దీవుల్లో ఆదివారం పెద్ద ఎత్తున భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. మనాడోకి ఆగ్నేయం దిశగా 185కి.మీ దూరంలో.. భూమికి 24కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ వెల్లడించింది. భారీ భూకంపం నేపథ్యంలో ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే భూకంపం వల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.భూమి ఒక్కసారిగా కంపించడం మొదలుపెట్టడంతో స్థానికులు కొంతమంది ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

కాగా, ఇండోనేషియాలో ప్రకృతి విపత్తులు తరుచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.2004లో సునామీ అల్లకల్లోలానికి 1,68,000మంది ఇండోనేషియన్లు మృతి చెందారు. సుమత్రా దీవుల్లో చోటు చేసుకున్న ఈ సునామీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపత్తుగా పరిగణిస్తారు. గత ఏడాది సులవేసిలో సంభవించిన భూకంపంలో 2200 మంది మృతి చెందారు. మరో 1000మంది అద‌ృశ్యమయ్యారు.రిక్టర్ స్కేలుపై ఆ సందర్భంలో భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. తాజాగా మరోసారి ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ అవడంతో.. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>