ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్..

కిమ్ ఆరోగ్యంపై పలు అనుమానాలు వస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.

news18-telugu
Updated: April 22, 2020, 7:05 AM IST
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్..
సింగపూర్ చర్చల్లో డొనల్డ్ ట్రంప్-కిమ్ జోంగ్ ఉన్.
  • Share this:
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు, హృదయ సంబంధిత శస్త్రచికిత్స వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైనట్లు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక అదే చెబుతోందని కూడా ఆ దేశ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. అయితే, కిమ్ ఆరోగ్యంపై పలు అనుమానాలు వస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘కిమ్ ఆరోగ్యం బాగుండాలి. ఇప్పటికైతే ఇది మాత్రమే చెప్పగలను’ అని ఆయన అన్నారు. కిమ్ బాగానే ఉన్నాడని తాను ఆశిస్తున్నానని, అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలు తన వద్ద లేవని స్పష్టం చేశారు. మీడియా కథనాలు నిజమో, కాదోనన్న విషయం తెలీదని ట్రంప్ తేల్చి చెప్పారు.

అయితే, కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందన్న వ్యాఖ్యలను దక్షిణ కొరియా కొట్టిపారేసింది. ఆ వార్తలపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని తెలిపింది. కాగా, కిమ్ ఆరోగ్యంపై ఉత్తర కొరియా అధికారులు కూడా స్పందించకపోవడాన్ని బట్టి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 22, 2020, 7:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading