వలసలు ఆపేందుకు ట్రంప్ వింత నిర్ణయం.. సరిహద్దుల్లో పాముల్ని, మొసళ్లను..

మెక్సికో బోర్డర్‌లో ఎలక్ట్రిక్ తీగలు అమర్చి వాటిపై ముళ్లు ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా దానికి కొద్ది దూరంలో నీటి కాలువ తవ్వి అందులో పాములు, మొసళ్లను ఉంచాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 2, 2019, 7:08 PM IST
వలసలు ఆపేందుకు ట్రంప్ వింత నిర్ణయం.. సరిహద్దుల్లో పాముల్ని, మొసళ్లను..
డొనాల్డ్ ట్రంప్ (Credit - Twitter - CNN Politics)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 2, 2019, 7:08 PM IST
మెక్సికో నుంచి అమెరికాకు వలసల్ని ఆపేందుకు సరిహద్దు చుట్టూ గోడ కడతానని చెప్పిన ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సరిహద్దుల్లో ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అయినా వలసలు ఆగడం లేదని ఓ వింత నిర్ణయం తీసుకున్నారాయన. బోర్డర్‌లో ఎలక్ట్రిక్ తీగలు అమర్చి వాటిపై ముళ్లు ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా దానికి కొద్ది దూరంలో నీటి కాలువ తవ్వి అందులో పాములు, మొసళ్లను ఉంచాలని అధికారులను ఆదేశించారాయన. వైట్‌హౌస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. వలసవాదులు కంచె దాటేందుకు ప్రయత్నిస్తే వారి కాళ్లను కాల్చేయాలని, కంచెపై మానవ మాంసపు వ్యర్థాల్ని ఏర్పాటు చేయాలని వింత నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన్ను శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో అరగంట సేపు జరగాల్సిన మీటింగ్ 2 గంటలకు పైగా జరిగిందని తెలిసింది.

అయితే, వలసవాదులకు కాస్త మద్దతిచ్చేలా మాట్లాడిన వారిపైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మీరు కఠినంగా వ్యవహరించడం లేదు. పనికిరారు’ అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...