• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • TRUMP SIGNS THE BILL US PRESIDENT DONALD TRUMP SIGNS COVID RELIEF AND GOVERNMENT FUNDING BILL FINALLY NK

Trump: కీలక ఆర్థిక ప్యాకేజీ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్... అమెరికాలో రాబోయే మార్పులేంటి?

Trump: కీలక ఆర్థిక ప్యాకేజీ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్... అమెరికాలో రాబోయే మార్పులేంటి?

డొనాల్డ్ ట్రంప్ (image credit - twitter - reuters)

Trump signs the Bill: డొనాల్డ్ ట్రంప్ మొండి ఘటమే కానీ అప్పుడప్పుడూ ఆయన మాట వింటారు. మరో నెల లోపే పదవి దిగిపోయే ఆయన... కీలక ఆర్థిక ప్యాకేజీ బిల్లుపై సంతకం చేసి మంచి పనిచేశారు.

  • Share this:
    Trump signs the Bill: అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారీ కరోనా వైరస్ రిలీఫ్ అండ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీ బిల్లు (Covid relief and government funding bill)పై సంతకం చేశారు. ఈ సంతకంతో అది చట్టంగా మారింది. కొన్ని రోజుల కిందట ఈ బిల్లును తాను తిరస్కరిస్తానని ట్రంప్ అన్నారు. దాంతో అమెరికావ్యాప్తంగా నిరుద్యోగ ప్రజలు టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లు వారికి చాలా అవసరం. ఈ ప్యాకేజీ వారికి చాలా కీలకం. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే... లేనిపోని తలనొప్పులు వచ్చేవి. అమెరికాలో నిరుద్యోగ సమస్య కుంపట్లు రాజేసేది. ఈ బిల్లుపై కొన్ని రోజులుగా ట్రంప్ సంతకం పెట్టకుండా నాన్చుతూ వచ్చారు. శనివారంతో బిల్లు డెడ్ లైన్ ముగిసింది. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే 1.40 కోట్ల మంది నిరుద్యోగ బీమా (unemployment insurance) కోల్పోయేవారు. సంతకం పెట్టడం వల్ల... వారంతా మార్చి వరకూ... ఉద్యోగాలు లేకపోయినా... ప్రతి వారం నిరుద్యోగ భృతి పొందగలరు.

    బిల్లును ఆమోదించడం వల్ల ఇప్పుడు అమెరికా ప్రభుత్వంపై 1.4 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఈ బిల్లులో అనవసరపు ఖర్చులు చాలా ఉన్నాయని, అవసరమైనవి లేవని ట్రంప్ మండిపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షడిగా రాబోతున్న జో బిడెన్... ట్రంప్‌పై గట్టిగానే ఒత్తిడి తెచ్చారు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బిల్లుపై సంతకం పెట్టకపోతే... తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


    ఈ మధ్యే ఈ రూ.66.3 లక్షల కోట్ల విలువైన ఆర్థిక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ కూడా సంతకం చెయ్యడం వల్ల... మార్చి వరకూ ప్రతి వారం 1.40 కోట్ల మందికి రూ.44,000 చొప్పున నిరుద్యోగ భృతి అందనుంది. ఐతే... ఇది చాలా తక్కువ అని ట్రంప్ అంటున్నారు. దీన్ని రూ.1.47 లక్షలకు పెంచాలన్నారు. చివరకు ఆ మార్పు లేకుండానే బిల్లును ఆమోదించారు.

    ఇది కూడా చదవండి:Rape Case: హైదరాబాద్‌లో అరాచకం... మహిళపై రేప్, హత్యాయత్నం... అత్యంత పాశవికంగా

    మొత్తానికి అమెరికా మరోసారి నిరుద్యోగ సంక్షోభంలోకి వెళ్లకుండా ఈ సంతకం అడ్డుకున్నట్లైంది. ఇప్పటికైతే అమెరికాకి సమస్య లేదు. మళ్లీ మార్చిలో జో బిడెన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టీ పరిస్థితులు ఉంటాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు