Home /News /international /

TRUMP SIGNS EXECUTIVE ORDERS BANNING TIKTOK WECHAT APPS IN AMERICA MK

Breaking News: అమెరికాలో TikTok యాప్ బ్యాన్ చేసిన ట్రంప్...

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టిక్ టాక్ అలాగే ఇతర చైనీస్ యాప్స్ జాతీయ భద్రతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ గురువారం సంతకం చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    Tiktok Ban In USA: యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ లాంటి చైనా యాప్స్ ను నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. టిక్ టాక్ అలాగే ఇతర చైనీస్ యాప్స్ జాతీయ భద్రతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ గురువారం సంతకం చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ భద్రతా సమస్యలను చూపుతూ టిక్‌టాక్, వీచాట్‌లను నిషేధించిన తొలి దేశంగా భారత్ అవతరిస్తే, ఇప్పుడు ట్రంప్ కూడా ఆ జాబితాలో చేరారు. చైనాలోని కంపెనీల ఆర్ అండ్ డీ ద్వారా యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రత, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని, కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో ట్రంప్ అన్నారు.

    చైనా కంపెనీ బైట్‌డాన్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్ మొబైల్ అప్లికేషన్ టిక్‌టాక్ దాని వినియోగదారుల నుండి అధిక మొత్తంలో సమాచారాన్ని సంగ్రహిస్తుందని, ఈ డేటాను సేకరించి అమెరికన్ల వ్యక్తిగత యాజమాన్య సమాచారాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చేరవేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఫెడరల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల స్థానాలను ట్రాక్ చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడం కోసం వ్యక్తిగత సమాచారం యొక్క పత్రాలను రూపొందించడానికి, కార్పొరేట్ గూఢచర్యం నిర్వహించడానికి ఈ యాప్స్ వినియోగిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

    హాంకాంగ్‌లో నిరసనలు, ఉయిగర్లు, ఇతర ముస్లిం మైనారిటీలపై చైనా వ్యవహరించడం వంటివి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే తప్పుడు సమాచారం ప్రచారానికి టిక్‌టాక్‌ను ఉపయోగించవచ్చని అట్రంప్ అన్నారు.

    ఈ ఉత్తర్వును అమలు చేయడానికి అన్ని విభాగాలు, ఏజెన్సీలు తమ అధికారం లోపల తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

    చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని మెసేజింగ్, సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ చెల్లింపు అప్లికేషన్ అయిన వీచాట్, అమెరికాలో వినియోగదారులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వినియోగదారులను కలిగి ఉందని ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ చెప్పారు.

    "టిక్‌టాక్ మాదిరిగా, వీచాట్ దాని వినియోగదారుల నుండి అధిక మొత్తంలో సమాచారాన్ని సంగ్రహించి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తుందని ఆయన పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Donald trump, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు