Home /News /international /

TRUMP SAYS WILL LEGALLY CHALLENGE RESULTS OF ALL STATES WON BY BIDEN ALLEGES VOTER FRAUD BA

US Elections 2020: జో బైడెన్ గెలిచిన రాష్ట్రాల్లో మోసం, లీగల్ ఫైట్ చేస్తామన్న ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)

‘బైడెన్ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తాం. అక్కడ భారీ ఎత్తున ఓటర్ ఫ్రాడ్, స్టేట్ ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది. దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి.’ అని ట్రంప్ అన్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు. అయితే, జో బైడెన్ వైట్ హౌస్‌లో అడుగు పెట్టడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టు ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన రాష్ట్రాల్లో ఎన్నికపై తాను న్యాయపోరాటం చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు లీక్ మాత్రమే ఇచ్చిన ట్రంప్ ఈసారి అధికారికంగా ధ్రువీకరించారు. ‘బైడెన్ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తాం. అక్కడ భారీ ఎత్తున ఓటర్ ఫ్రాడ్, స్టేట్ ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది. దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. జస్ట్ మీడియాను చూడండి. మనం గెలుస్తాం. అమెరికా ఫస్ట్.’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.



    నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం జో బైడెన్ ముందంజలో ఉన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో మేజిక్ ఫిగర్ అయిన 270 ఓట్లకు దగ్గరలో ఉన్నారు. అయితే, ఓట్ల లెక్కింపు ఆలస్యం మీద ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగించారని కూడా ఆయన ఆరోపించారు. ఇక ఐదు ముఖ్యమైన రాష్ట్రాలైన పెన్సుల్వేనియా, నేవడా లాంటి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదు. దీన్ని బట్టి ఎవరైనా గెలవొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

    అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రిపబ్లికన్లు 23 రాష్ట్రాల్లో గెలవొచ్చని అంచనా వేశాయి. ట్రంప్ 2016లో గెలిచిన ఫ్లోరిడా, టెక్సాస్, ఇండియానా, కెంటకీ, ముసోరీ, ఓహియో రాష్ట్రాల్లో మళ్లీ ఆయనే గెలవొచ్చని భావించాయి. మరోవైపు జో బైడెన్ 22 రాష్ట్రాలను దక్కించుకున్నారు. అందులో కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ లాంటివి కూడా ఉన్నాయి. గతంలో ట్రంప్ గెలిచిన మిచిగాన్, విస్కన్సన్, అరిజోనాలో తాజాగా బైడెన్ డెమొక్రాట్ల జెండా ఎగరేసినట్టు చెబుతున్నారు. అరిజోనాలో పరిస్థితులు బైడెన్‌కు అనుకూలంగానే ఉన్నాయని ఫాక్స్ న్యూస్, అసోసియేటెడ్ ప్రెస్ తెలిపాయి. దీంతో బైడెన్‌కు 264 ఎలక్టోలర్ ఓట్లు వస్తాయి. పొలిటికో, ది వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటివి కూడా ఈ నెంబర్ చూపిస్తున్నాయి. అయితే, సీఎన్ఎన్ మాత్రం బైడెన్‌కు 253, ట్రంప్‌కి 213 ఎలక్టోరల్ ఓట్లు చూపిస్తోంది.

    మరోవైపు జోబైడెన్ గెలుపు మీద ధీమాగా ఉన్నారు. ఒకవేళ ట్రంప్ న్యాయపోరాటం చేస్తే, దాన్ని కౌంటర్ చేయడానికి డెమొక్రాట్ల లీగల్ టీమ్‌ కూడా సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్క ఓటును లెక్కించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు.



    అమెరికాలో కరోనా కావడంతో చాలా మంది ఎన్నికల రోజు కంటే ముందస్తు ఓటింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో  పోస్టల్ బ్యాలెట్లు చాలా వచ్చాయి. వాటిని లెక్కించడం ఆలస్యం అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజుల తరబడి కూడా పట్టొచ్చని చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Donald trump, Joe Biden, US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు