news18-telugu
Updated: June 5, 2020, 7:35 AM IST
డోనాల్డ్ ట్రంప్
బంకర్‌లోకి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే తాను దాన్ని పరిశీలించడానికి మాత్రమే వెళ్లానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం వైట్ హౌజ్ వద్ద వేలాది మంది నిరసన చేపట్టడంతో ట్రంప్, ఆయన భార్య, కుమారుడు బంకర్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్.. తాను మధ్యాహ్నం సమయంలోనే బంకర్‌ను పరిశీలించానని, సాయంత్రం వెళ్లినట్లు వచ్చిన కథనాల్లో నిజం లేదని అన్నారు. అదికూడా కాసేపు మాత్రమే అక్కడ ఉన్నానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా నల్లజాతీయులు చేపట్టిన ఆందోళనలకు ట్రంప్ చిన్న కూతురు టిఫానీ మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించారు. ట్రంప్ మాజీ రెండో భార్య మార్లా కూడా నిరసనలకు తన మద్దతిచ్చారు.
First published:
June 5, 2020, 7:35 AM IST