అమెరికా 45వ అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు ఇదే ఆఖరి రోజు. బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలనుద్దేశించి వీడ్కోలు సందేశం ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. 20 నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్రి రికార్డెడ్ వీడియోను వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసింది. ఏం చేసేందుకు అధికారంలోకి వచ్చామో..తన పాలనలో అన్నీ చేశామని ట్రంప్ చెప్పారు. చెప్పినదాని కన్నా ఎక్కువే చేశామని పేర్కొన్నారు. దేశం కోసం కఠినమైన యుద్ధాలు.. పోరాటాలను చేశామని ఆయన అన్నారు.
ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆర్థిక వ్వవస్థను తమ ప్రభుత్వం నిర్మించిందిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రైటా, లెఫ్టా లేక రిపబ్లికనా లేక డెమొక్రాటా అన్నది తమ అజెండా కాదు. మెరుగైన దేశమే తమ అజెండా ఆయన అన్నారు. ఇటీవల కాపిటల్ భవనంపై జరిగిన దాడిపైనా ఆయన మాట్లాడారు. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగే దాడిగానే చూడాలని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా భద్రత, అభివృద్ధి కోరుకునే వాడిగా.. తదుపరి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, అమెరికన్ పార్లమెంటుపై దాడికి ప్రేరేపించారని డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్. పదవి నుంచి వైదొలగిన తరువాత సెనేట్‌లో ఆయన విచారణ ఎదుర్కొంటారు. అందో దోషిగా తేలితేగా ఇంకెప్పుడూ ప్రభుత్వ పదవులకు పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ 34% జనామోదం రేటింగుతో పదవి నుంచి వైదొలుగుతున్నారు. ఇంత తక్కువ రేటింగ్ ఇంకెవరికీ రాలేదు.
మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా బైడెన్, మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ (Kamala Harris) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనం ముట్టడి తర్వాత జరుగుతున్న ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.
భారత కాలమానం ప్రకారం జనవరి 20 బుధవారం రాత్రి 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమెరికా జాతీయగీతంలో ఆరంభమవుతుంది. యూఎస్ఏ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రజలనుద్దేశించి మొదటగా లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి ముందు కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తర్వాత శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేయడాన్ని సూచించడానికి బైడెన్, కమలా హ్యారిస్ పాస్ ఇన్ రివ్యూ తనిఖీని పూర్తి చేస్తారు.