• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • TRUMP PHONE CALL TO GEORGIA ELECTION CHIEF DEMANDS CHANGE ELECTION RESULT AUDIO TAPE LEAKED HSN

Donald Trump: బయటపడిన ట్రంప్ వార్నింగ్ ‘ఆడియో టేప్’.. అమెరికాలో మరో రచ్చ స్టార్ట్..!

డొనాల్డ్ ట్రంప్ (image credit - twitter - reuters)

జార్జియా రాష్ట్రం మొదటి నుంచి రిపబ్లికన్ల అడ్డా లాంటిది. కానీ అక్కడ ఈ సారి డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. జో బైడెన్ కు 11,779 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న 16 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ పరిణామంపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    వాషింగ్టన్: మరికొద్ది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఓ ఆడియో టేప్ ప్రస్తుతం అగ్రరాజ్యమంతటా హల్ చల్ చేస్తోంది. ఎంతకు తెగించైనా అమెరికా అధ్యక్ష పదవిని మళ్లీ చేజిక్కించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని డెమొక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. జార్జియా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన అధికారితో ట్రంప్ ఫోన్లో మాట్లాడి, ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

    జార్జియా రాష్ట్రం మొదటి నుంచి రిపబ్లికన్ల అడ్డా లాంటిది. కానీ అక్కడ ఈ సారి డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. జో బైడెన్ కు 11,779 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న 16 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ పరిణామంపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జార్జియా రాష్ట్రం చేజారిపోయిందంటేనే ఆయన నమ్మలేకపోతున్నారు. బైడెన్ కు వచ్చిన 11,779 ఓట్లు అక్రమంగా వచ్చినవేననీ, చనిపోయిన వారి ఓట్లను కూడా ఆయనకు కలిపేశారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వచ్చే జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. ఈ లోపే ఫలితాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ట్రంప్ అడ్డంగా దొరికిపోయారు. జార్జియాలో ఎన్నికలు నిర్వహించిన రిపబ్లికన్ నేత, ఆ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రఫెన్స్ పెర్జర్ కు ట్రంప్ ఫోన్ చేశారు.

    ’ప్రస్తుతం నాకు, బైడెన్ కు కేవలం 11,779 ఓట్ల తేడా ఉంది. ఈ ఓట్లు నాకు కావాలి. మళ్లీ ఓట్లను లెక్కించి, నాకు ఓట్లను వచ్చేలా చెయ్. ఇందులో తప్పేం లేదు. వాళ్లకు అసలు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. కాబట్టి ఓట్లను మళ్లీ లెక్కించి నేను గెలిచినట్టు ప్రకటన చేయాలి. జార్జియా మనదే.‘ అంటూ ట్రంప్ ఆ ఫోన్ కాల్ లో బ్రాడ్ తో వ్యాఖ్యలు చేశారు. గెలుపును తారుమారు చేయకపోతే బ్రాడ్ తోపాటు మరో కీలక అధికారి కూడా చిక్కుల్లో పడతారు జాగ్రత్త అంటూ ట్రంప్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో టేప్ ను అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీంతో అగ్రరాజ్యం అంతా హాట్ టాపిక్ గా మారింది.



    ఈ విషయమై అటు బ్రాడ్ కానీ, ఇటు వైట్ హౌస్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం బ్రాడ్ తో మాట్లాడిన విషయాన్ని ధృవీకరించారు. ’జార్జియా డేటా ఇప్పుడే వచ్చింది. దాదాపు 17 వేల ఓట్లు ట్రంప్ నుంచి బైడెన్ కు అక్రమంగా మళ్లాయని తేలింది. ఇదొక్క ప్రూఫ్ చాలు జార్జియా ట్రంప్ కు మారడానికి.. అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఘోరాలు ఇంకా చాలానే ఉన్నాయి..‘ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి బ్రాడ్ కూడా స్పందించారు. ’మీరు చెబుతున్నది నిజం కాదు ప్రెసిడెంట్ ట్రంప్. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు..‘ అని బ్రాడ్ రియాక్టయ్యారు.

    అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ, అన్యాయమైన పద్ధతుల్లో తన నుంచి అధ్యక్ష పదవిని లాక్కుంటున్నారని మొదటి నుంచి ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఆరోపణలను రిపబ్లికన్ నేతలే కొట్టి పారేస్తుండటం గమనార్హం. తాజాగా ఆయన ఫోన్ కాల్ ఆడియో అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Hasaan Kandula
    First published: