Home /News /international /

ByteDance Ban | 90 రోజుల్లో అమ్మేయండి...బైట్‌డాన్స్‌కు ట్రంప్ డెడ్‌లైన్

ByteDance Ban | 90 రోజుల్లో అమ్మేయండి...బైట్‌డాన్స్‌కు ట్రంప్ డెడ్‌లైన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో చైనా యాప్ టిక్ టాక్ ఆపరేషన్స్‌ను మరో 90 రోజుల్లో అమ్మేయాలంటూ దాని మాతృ సంస్థ బైట్ డాన్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చారు. దేశ అంతర్గత భద్రద, వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లుతోందన్న కారణంగా చైనా మొబైల్ యాప్‌లు టిక్ టాక్‌, ఉయ్‌ఛాట్‌ను బ్యాన్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశారు.

ఇంకా చదవండి ...
    Tiktok Ban in US: అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ‌కు సంబంధించిన ఆస్థులను మరో 90 రోజుల్లో అమ్మేయాలంటూ దాని మాతృ సంస్థ బైట్ డాన్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చారు. దేశ అంతర్గత భద్రద, వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లుతోందన్న కారణంగా చైనా మొబైల్ యాప్‌లు టిక్ టాక్‌, ఉయ్‌ఛాట్‌ను బ్యాన్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశారు. ఆ మేరకు టిక్‌టాక్‌పై ఈ నిషేధాజ్ఞలు మరో 45 రోజుల్లో అమలులోకి రానుంది. దేశ భద్రతకు టిక్ టాక్ ముప్పువాటిళ్లు జేస్తున్నట్లు తనకు స్పష్టమైన సమాచారం ఉందని ట్రంప్ ఇది వరకే ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్‌ను ఇతర సంస్థలకు విక్రయించాల్సిన నిర్భందకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

    మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తదితర సంస్థలు అమెరికాలో టిక్ టాక్ కొనుగోలుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ సహా అమెరికాకు చెందిన ఏ సంస్థ టిక్ టాక్‌ను కొనుగోలు చేసినా తనకు సమస్యలేదని ఇటీవల  ట్రంప్ పేర్కొన్నారు. అయితే కొన్ని వాటలు కొనుగోలు చేసినా సంతృప్తి చెందేది లేదని...పూర్తిగా టిక్ టాక్ అమెరికా ఆఫరేషన్స్‌ను ఆ సంస్థలు కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. టిక్ టాక్‌కు సంబంధించిన ఆస్తులను కూడా బైట్ డాన్స్ 90 రోజుల్లో అమ్మేయాలని ట్రంప్ ఆదేశించారు.

    TikTok, china app, tiktok ban, usa ban, bytedance, us ban, tiktok plan, indian apps, google play store, టిక్ టాక్, టిక్ టాక్ బ్యాన్, బైట్ డాన్స్, చైనా యాప్, అమెరికా నిషేధం, అమెరికా బ్యాన్,
    TikTok


    చైనా యాప్స్‌పై బ్యాన్ నేపథ్యంలో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాలను చైనాలో నిషేధించొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కథనాలను డొనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసిపారేశారు. తాను దేశ భద్రతకు ఏది మంచిదో..అదే చేస్తున్నానని ట్రంప్ శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. టిక్ టాక్, ఉయ్ చాట్ తదితర చైనా యాప్స్‌ను అమెరికాలో బ్యాన్ చేయడంతో తమ సంస్థలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆపిల్ తదితర అమెరికా టెక్ దిగ్గజ సంస్థలు కొన్ని రోజుల క్రితం ఆందోళన వ్యక్తంచేశాయి.
    Published by:Janardhan V
    First published:

    Tags: Donald trump, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు