హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Trump : ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఏకంగా ఓటింగ్ మెషిన్లనే సీజ్ చేయాలని ట్రంప్ ఆదేశించారంట!

Trump : ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఏకంగా ఓటింగ్ మెషిన్లనే సీజ్ చేయాలని ట్రంప్ ఆదేశించారంట!

  Donald Trump :  2020 నవంబర్ లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పట్లో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్(DONALD Trump)-జో బైడెన్(Joe Biden) మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బైడెన్ విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని నుంచి చాలా రోజులు తేరుకోలేకపోయారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ అప్పట్లో రక్షణశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయిన కొన్ని వారాల తర్వాత డిసెంబర్-16,2020న వైట్ హౌస్ నుంచి దేశంలోని టాప్ మిలటరీ లీడర్ కు ఓ డ్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెళ్లింది. ఆ డ్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో..ఓటింగ్ మెషిన్లను సీజ్ చేయాలని ట్రంప్ యూఎస్ డిఫెన్స్ స్టాఫ్ ని ఆదేశించినట్లు శుక్రవారం బయటికొచ్చిన ఓ సంచలన రిపోర్ట్ తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన మెషీన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు,ఎలక్ట్రానిక్ డేటా,రికార్డులన్నంటినీ భద్రపరచాలని ట్రంప్ ఆదేశించినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది.

  ALSO READ Afghan Porn Star: అప్ఘానిస్తాన్‌లో ఏకైక పోర్న్ స్టార్ ఈమె.. తాలిబన్లకు చిక్కితే తల తెగడం ఖాయం

  అంతేకాకుండా ఓటింగ్ మెషిన్లను సీజ్ కి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా మోసం ఆరోపణలపై అభియోగాలు మోపడానికి ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించాలని వైట్ హౌస్ నుంచి డిఫెన్స్ స్టాఫ్ కి అందిన ఆ ఆర్డర్ లో ఉన్నట్లు శుక్రవారం నేషనల్ ఆర్కైవ్స్( అమెరికా ప్రభుత్వం యొక్క స్వతంత్ర ఏజెన్సీ)బయటపెట్టిన సంచలన రిపోర్ట్ లో పేర్కొంది. కానీ ఆ ఆర్డర్ పై ట్రంప్ సంతకం లేదని రిపోర్ట్ లో పేర్కొంది. అయితే, ట్రంప్ ఓటమి తర్వాత 2021 జనవరి ఆరో తేదీన వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిపై విచారణ జరిపిన ప్రతినిధుల సభ సెలెక్ట్ కమిటీకి అప్పగించిన 750 పైగా రికార్డులలో ఇది కూడా ఒకటి.

  మరోవైపు,అమెరికా క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను నిషేధిస్తూ పలు సోషల్‌ మీడియా సంస్థలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సొంత ప్లాట్‌ఫాంకు ట్రంప్‌ వడివడిగా అడుగులు వేస్తూ ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రూత్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌పాంను త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా దిగ్గజాలపై అక్కసును తెలియజేస్తూ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌.. యూఎస్‌ ప్రెసిడెంట్‌ డే అయిన ఫిబ్రవరి 21న లాంచ్‌ లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రూత్‌ డెమో ఫోటోల ప్రకారం ట్విటర్‌ మాదిరిగానే ఈ యాప్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రెండింగ్‌ టాపిక్స్‌, ట్యాగింగ్‌ వంటి ఆప్షన్స్‌తో రానుంది. ఇప్పటికే ట్రూత్‌కు సంబంధించిన వివరాలను ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) యాపిల్‌ ఇంక్‌ యాప్‌ స్టోర్‌ లిస్టింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Donald trump, US Elections 2020

  ఉత్తమ కథలు