అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం: నిబంధనను రద్దు చేసే ప్లాన్‌లో ట్రంప్

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ నిబంధన తీసుకురావడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 30, 2018, 10:56 PM IST
అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం: నిబంధనను రద్దు చేసే ప్లాన్‌లో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫోటో: Reuters)
  • Share this:
అమెరికా వెళ్లే వారిలోచాలా మంది కల గ్రీన్ కార్డు. అయితే, చాలా మంది తమకు గ్రీన్ కార్డు రాకపోయినా.. తమ పిల్లలు అమెరికాలో పుడితే వారికి అమెరికా పౌరసత్వం వస్తుందని ఆశిస్తారు. అయితే, అలాంటి వారి ఆశలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నీళ్లు జల్లబోతోంది. ‘బర్త్ రైట్’‌కు చెక్ పెట్టాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికాలో పిల్లలు పుడితే పౌరసత్వం వస్తుందని ఆశలు పెట్టుకున్న చాలా మందికి షాక్ తగలనుంది. ఆసియా, ఐరోపా దేశాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వలసలు వస్తున్నారు. మెక్సికో నుంచి అక్రమంగా చొరబడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారికి అమెరికా గడ్డ మీద పిల్లలు పుడితే ఆ పసిబిడ్డలకు యూఎస్ పౌరసత్వం వస్తుంది. అయితే, దీన్ని అడ్డుకోవడానికి ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

ట్రంప్ అనుకున్న పని అంత సులువు కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం అమెరికా రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి వస్తుందంటున్నారు. అయితే, ‘ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో నేను ఈ పని చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.’అని ట్రంప్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇలాంటి నిబంధన లేదని అమెరికా అధ్యక్షుడు అన్నట్టు యాక్సిస్ అనే వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ ప్రతిపాదనను వైట్ హౌస్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 30, 2018, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading