ఉత్తర కొరియా కిమ్‌పై ట్రంప్ ఆగ్రహం...అమెరికా సహనానికి పరీక్ష

కిమ్ ఆగడాలతో ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. అమెరికాపై ఒత్తిడి పెంచి అయితే అణ్వస్త్రాల అంశంపై నిలిచిపోయిన చర్చలను కొనసాగించాలనే ఈ పరీక్షను చేపట్టినట్టు ఉత్తరకొరియా మీడియాలో ప్రకటించింది.

news18-telugu
Updated: December 10, 2019, 10:34 PM IST
ఉత్తర కొరియా కిమ్‌పై ట్రంప్ ఆగ్రహం...అమెరికా సహనానికి పరీక్ష
ట్రంప్, కిమ్ (Image: CNN)
  • Share this:
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలను తుంగలో తొక్కి క్షిపణులు, అణ్వస్త్రాల పరీక్షలు నిర్వహించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌ అయ్యారు. ఇలాగే వ్యవహరిస్తే అమెరికాతో బంధాలను ఉత్తరకొరియా కోల్పోయే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరించారు. కిమ్ ఆగడాలతో ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. అమెరికాపై ఒత్తిడి పెంచి అయితే అణ్వస్త్రాల అంశంపై నిలిచిపోయిన చర్చలను కొనసాగించాలనే ఈ పరీక్షను చేపట్టినట్టు ఉత్తరకొరియా మీడియాలో ప్రకటించింది. ఇదిలా ఉంటే గతంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సింగపూర్ వేదికగా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా పలు ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే అటు కిమ్ ఆగడాలపై దక్షిణ కొరియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తే తిప్పి గొడతామని దక్షిణ కొరియా తెలిపింది.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>