హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Trump Close Friend: అమెరికాలో కీలక పరిణామం.. దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ అరెస్ట్

Trump Close Friend: అమెరికాలో కీలక పరిణామం.. దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ అరెస్ట్

ట్రంప్‌తో టామ్ బరాక్ (ఫైల్ ఫొటో)

ట్రంప్‌తో టామ్ బరాక్ (ఫైల్ ఫొటో)

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌‌కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, ట్రంప్ రాజకీయ సహాయకుడు టామ్ బరాక్‌(75)ను అమెరికాలోని ఫెడరల్ అథారిటీస్ అరెస్ట్ చేశాయి. అరబ్ దేశమైన యూఏఈకి ఏజెంట్‌గా మారి అమెరికాలో లాబీయింగ్ చేశాడనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...

వాషింగ్టన్‌డీసీ: అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌‌కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, ట్రంప్ రాజకీయ సహాయకుడు టామ్ బరాక్‌(75)ను అమెరికాలోని ఫెడరల్ అథారిటీస్ అరెస్ట్ చేశాయి. అరబ్ దేశమైన యూఏఈకి ఏజెంట్‌గా మారి అమెరికాలో లాబీయింగ్ చేశాడనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 2016 నుంచి ఏప్రిల్ 2018 మధ్య యూఏఈకి బరాక్ ఏజెంట్‌గా పనిచేశారని ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లకు తప్పుడు ప్రకటనలు ఇవ్వడం, న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడం బారక్‌పై ఉన్న ప్రధానమైన అభియోగాలు. బరాక్‌కు అసోసియేట్‌గా వ్యవహరించిన మ్యాథ్యూ గ్రిమ్స్‌ను కూడా అరెస్ట్ చేశారు. యూఏఈ సిటిజన్ అయిన రషీద్ సుల్తాన్ అల్ మాలిక్ అల్సాహిపై కూడా కేసు నమోదైంది. ఈ ముగ్గురిపై ఏడు కౌంట్ల నేరారోపణలను నమోదు చేశారు. యూఏఈ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు బరాక్ ట్రంప్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలానే చేశారని తెలిసింది. 2016, మేలో ప్రచారంలో భాగంగా బరాక్.. యూఏఈకి అనుకూలంగా ప్రకటన చేశారని కూడా సమాచారం.

ఈ ఆరోపణల ప్రకారం.. బరాక్ యూఏఈతో, ఆ దేశ నాయకత్వంతో ప్రత్యక్షంగానే సంబంధాలను కలిగి ఉన్నట్లు స్పష్టమైంది. ఈ కేసులో బరాక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జులై 25న న్యాయస్థానం ముందుకు రానుంది. బరాక్ ఎవరనే విషయానికొస్తే.. బరాక్ కాలిఫోర్నియాలోని శాంటా మొనికా నివాసి. ఆయన ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్. ట్రంప్‌కు మంచి మిత్రుడు మాత్రమే కాదు అత్యంత విశ్వాసపాత్రుడు కూడా. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో బరాక్ కూడా చోటు దక్కించుకున్నాడు. లాస్ ఏంజెల్స్‌లో బరాక్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. మిడిల్ ఈస్ట్‌లో 200 మిలియన్ డాలర్ల ఆస్తులు బరాక్ కలిగి ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఇప్పటికే రెండు క్రిమినల్ కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్‌లో ట్రంప్ తన కంపెనీలకు రుణం పొందడం కోసం ఆస్తుల విలువలను తక్కువ చేసి చూపారనే ఆరోపణలున్నాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూశారని ఆయనపై అభియోగాలున్నాయి. జార్జియాలో ఈ అభియోగాలపై దర్యాప్తు జరుగుతోంది.

First published:

Tags: America, Donald trump, UAE, USA

ఉత్తమ కథలు