హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump: ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. ట్రంప్ కు ఊహించని షాక్..!

Donald Trump: ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. ట్రంప్ కు ఊహించని షాక్..!

డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)

డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)

ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష పదవిని వదులుకోనని చెబుతూ వచ్చిన ట్రంప్, బుధవారం జరిగిన అనూహ్య పరిణామాలతో ఎట్టకేలకు దారిలోకి వచ్చారు. అధ్యక్ష పదవీ బదలాయింపునకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ట్రంప్ ఖండించారు.

ఇంకా చదవండి ...

వాషింగ్టన్: అమెరికాలో బుధవారం జరిగిన వరుస సంఘటనలను ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ ఘటనల షాకింగ్ నుంచి అమెరికన్ ప్రజలు ఇంకా తేరుకోలేకపోయారు. అమెరికాలో ఇంతవరకు అలాంటి ఘటన జరగలేదని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఏకంగా అమెరికన్ క్యాపిటల్ భవనంలోకే నిరసనకారులు చొచ్చుకొచ్చేలా ఓ దేశాధ్యక్షుడు ఉసిగొల్పిన దాఖలాలు లేవని వివరిస్తున్నారు. కాగా తన మద్దతు దారులను క్యాపిటల్ భవనంలోకొ చొరబడమని చెప్పి, ప్రోత్సహించి నలుగురి మరణానికి పరోక్ష కారణమైన ట్రంప్, ఊహించనంత వేగంగా మాట మార్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష పదవిని వదులుకోనని చెబుతూ వచ్చిన ట్రంప్, బుధవారం జరిగిన అనూహ్య పరిణామాలతో ఎట్టకేలకు దారిలోకి వచ్చారు. అధ్యక్ష పదవీ బదలాయింపునకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ట్రంప్ ఖండించారు.

’క్యాపిటల్ భవనంపై దాడి జరగడం బాధాకరం. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇలాంటి ఘటన జరగడం నాకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనను అదుపులోకి తీసుకురమ్మని నేనే ఆదేశాలు ఇచ్చా. వెంటనే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాను. ఆ నిరసన కారులను భవనం నుంచి వెనక్కు పంపించేశాం. ఇలాంటి క్రూరమైన ఘటనకు పాల్పడి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను నిరసన కారులు అపహాస్యం చేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. ఓడిపోయిన వారిలో భావోద్వేగాలు సహజం కానీ, వాటిని అదుపులోనే ఉంచుకోవాలి‘ అంటూ ట్రంప్ హిత వచనాలు పలికారు. జనవరి 20న జరగబోయే అధ్యక్ష పదవీ బాధ్యతల బదలాయింపునకు పూర్తిగా సహకరిస్తానని ట్రంప్ ప్రకటన చేశారు.

కాగా ఇదే సమయంలో ఫేస్ బుక్, ట్విటర్ ఊహించని షాకిచ్చాయి. అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తర్వాత సామాజిక మాధ్యమాలు ట్రంప్ పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ట్విటర్ ఈ నిషేధాన్ని ఇప్పటికే తొలగించింది. అయితే ఫేస్ బుక్ మాత్రం ఈ నిషేధాన్ని తీసేయబోవడం లేదని తాజాగా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఓ పోస్టులో పేర్కొన్నారు.‘ ట్రంప్ పై విధించిన 24 గంటల నిషేధాన్ని జీవితకాలంగా మారుస్తున్నాం. అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం ఘోరం. క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్ ఫేస్ బుక్ ను వినిగించుకున్న తీరును మేం ఖండిస్తున్నాం. నిరసనకారుల చర్యలను ఖండించకుండా, వాటిని ప్రోత్సహించేలా ఆయన ఫేస్ బుక్ ప్లాట్ ఫాంను వాడుకున్నారు. హింసను ప్రేరేపించేలా ట్రంప్ ప్రవర్తించారు. అందుకే మేం ఆయనపై నిరవధికంగా నిషేధాన్ని విధిస్తున్నాం..‘ అని జుకర్ బర్గ్ తన పోస్ట్ లో పేర్కొనడం గమనార్హం.

First published:

Tags: America, Donald trump, International news, Joe Biden, NRI News, US Elections 2020

ఉత్తమ కథలు