చైనాపై ట్రంప్ కొరడా...33 చైనీస్ కంపెనీలు బ్లాక్ లిస్ట్...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అలాగే ఫేషియల్ రికగ్నిషన్ వంటి సాంకేతిక రంగాలలో సేవలు అందిస్తున్న కంపెనీలు ఈ బ్లాక్ లిస్టులో ఉన్నాయి.

news18-telugu
Updated: May 24, 2020, 8:33 AM IST
చైనాపై ట్రంప్ కొరడా...33 చైనీస్ కంపెనీలు బ్లాక్ లిస్ట్...
డొనాల్డ్ ట్రంప్
  • Share this:
కరోనావైరస్ కారణం చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని కొనసాగిస్తున్నారు. చైనా స్టాక్ మార్కెట్ ఇప్పటికే బిలియన్ డాలర్ల యుఎస్ పెన్షన్ నిధులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తరువాత, యుఎస్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 చైనా కంపెనీలు వాటి అనుబంధ సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయబోతోంది. యుఎస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, చైనా కు చెందిన 7 కంపెనీలుతో పాటు మరో రెండు సంస్థను జాబితాలో చేర్చామని, ఎందుకంటే అవి చైనాలోని ఉగార్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలో భాగంగా చైనా ప్రభుత్వం చేసే పనులకు ఆ సంస్థు సహాయం చేస్తున్నట్లు నిర్ధారించినట్లు తెలిపింది. అంతేకాదు పెద్ద సంఖ్యలో ప్రజలను నిర్బంధించి వారి శ్రమను బలవంతంగా దోచుకునేందుకు హైటెక్ టెక్నాలజీ సహాయంతో పర్యవేక్షించడంలో ఆ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహాయం చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. అంతే కాకుండా, చైనా సైన్యానికి వస్తువుల సరఫరా చేస్తున్న కారణంగా సుమారు రెండు డజన్ల ఇతర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అలాగే ఫేషియల్ రికగ్నిషన్ వంటి సాంకేతిక రంగాలలో సేవలు అందిస్తున్న కంపెనీలు ఈ బ్లాక్ లిస్టులో ఉన్నాయి. ఇంటెల్ కార్ప్, ఎన్విడియా కార్ప్ సహా అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు ఈ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి.బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలలో నెట్‌పోసా అనే అతి పెద్ద చైనీస్ AIసంస్థ కూడా ఉంది, ఈ సంస్థ కింద పనిచేసే అనుబంధ సంస్థలు వ్యక్తులను ముఖకవళికలను పర్యవేక్షిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని ట్రంప్ నొక్కి చెప్పారు. అమెరికా దీనిని తేలికగా తీసుకోబోదని అన్నారు. "కరోనా వైరస్ చైనా నుండి వచ్చింది" అని ట్రంప్ మిచిగాన్‌లో ఆఫ్రికన్ అమెరికన్ నాయకులతో జరిగిన భేటీ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో తాము సంతోషంగా లేమని. వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధంగా చైనా నడుస్తోందని ఆరోపించారు. అయితే, చైనాకు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోవాలో అమెరికా అధ్యక్షుడు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.

అంతకుముందు, రిపబ్లికన్ సెనేటర్లు ట్రేడ్ క్రూజ్, రిక్ స్కాట్, మైక్ బ్రాన్, మార్షా బ్లాక్బర్న్, జానీ ఎర్నెస్ట్, మార్తా మాక్లెస్లీ, టామ్ కాటన్ లతో కలిసి ట్రంప్ కోవిడ్ 19 ప్రొటెక్షన్ యాక్ట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు కోవిడ్ -19 వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్న చైనా పరిశోధకుల వీసాలపై సమీక్షించాలని ఈ బిల్లు ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, విదేశాంగ శాఖ ఎఫ్‌బిఐ నుండి అనుమతి కోరింది.
Published by: Krishna Adithya
First published: May 24, 2020, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading