విదేశీయులంటే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చాలా చీప్ అయిపోతోంది. 10 లక్షల మందికి పైగా నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్ 1, ఎం 1 వీసాలపై ఆన్లైన్లో చదువుకుంటున్న విద్యార్థులను అమెరికా వదిలి వెళ్లమని ఆదేశించారు. సడెన్‌గా ఇలా చెబితే... ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే... ఈ కరోనా వచ్చాక... విదేశీ విద్యార్థులకు అమెరికాలో జీవితం మరింత కష్టాలమయం అయ్యింది. తాజా ఆదేశంతో... వాళ్లంతా రోడ్డున పడతారు. ప్రత్యక్షంగా తరగతులకు వచ్చే విద్యార్థులే అమెరికాలో ఉండాలని ట్రంప్ తెలిపారు. ఆన్లైన్ క్లాసులు జరిగే యూనివర్శిటీలు, కాలేజీల స్టూడెంట్స్ వెంటనే అమెరికా వదిలి వెళ్లిపోవాలని ఆర్డరేశారు. లేదంటే... డైరెక్టుగా తరగతులు చెప్పే యూనివర్శిటీల్లో చేరమని సూచించారు.
మన దేశంలో లాగే... అమెరికాలో కూడా చదువులు సాగట్లేదు. నెక్ట్స్ తరగతులు ఎప్పుడు జరిపేదీ... యూనివర్శిటీలు చెప్పట్లేదు. ఎందుకంటే... రోజూ 50 వేల కొత్త కరోనా కేసులు వస్తున్నాయి కదా... అందువల్ల యూనివర్శిటీలకే ఫ్యూచరేంటో అర్థం కావట్లేదు. ఇలాంటి టెన్షన్ సమయంలో... ట్రంప్ కొంప ముంచుతున్నారు. దీనిపై సెనేటర్ బెర్నీ శాండర్స్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. నానాటికీ ట్రంప్ దారుణాలు ఎక్కువైపోతున్నాయని మండిపడ్డారు.
అసలు ట్రంప్ నిర్ణయం అర్థం పర్థం లేకుండా ఉంది. ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉండదు. ఐతే... డైరెక్టుగా వచ్చి వర్సిటీల్లో తరగతులకు హాజరైతే... కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ట్రంప్ ఇలా అనడమేంటని విద్యార్థుల పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. అమెరికాలో... చైనా, ఇండియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియాకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఆదేశం వల్ల వాళ్ల కెరీర్ నాశనం అవుతుంది.
స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటూ... నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన ట్రంప్... మళ్లీ నవంబర్‌లో జరిగే ఎన్నికల కోసం స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అందుకే వరుసగా విదేశీయులకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వీసా నిబంధనల వల్ల భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే... ఇప్పుడీ కొత్త ఆదేశం మరో పిడుగుపాటులా మారింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.