గ్రీన్ కార్డు విషయంలో భారతీయులకు అమెరికా షాక్!

ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, ఇకపై కూడా ప్రభుత్వ పథకాలు అవసరం లేదని, సొంతగానే నిలదొక్కుకొని అమెరికాలో స్థిరపడతామని ధృవీకరిస్తూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ముందుకు కదులుతుంది.

news18-telugu
Updated: September 24, 2018, 1:27 PM IST
గ్రీన్ కార్డు విషయంలో భారతీయులకు అమెరికా షాక్!
Illustration by Mir Suhail.
  • Share this:
అమెరికాలో నివసించే ప్రవాస భారతీయులకు డోనాల్డ్ ట్రంప్ ఊహించని షాకిచ్చారు. గ్రీన్ కార్డు పొందాలన్న కలల్ని ట్రంప్ కూల్చేశారు. ఇకపై గ్రీన్ కార్డు జారీ చేసే విషయంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది ట్రంప్ సర్కార్. గ్రీన్ కార్డు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను, లాభాలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధనతో అమెరికాలో నివసించే భారతీయులకు గట్టి షాకిచ్చినట్టైంది.

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొంది అక్కడే నివసించాలన్నది చాలామంది భారతీయుల కల. ఎంతోమంది గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ ఇప్పుడు నిబంధనలు మారడం ప్రవాస భారతీయుల్ని అయోమయంలో పడేసింది. ఆ నిబంధనల ప్రకారం... గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందకూడదు. ఆహార, నగదుకు సంబంధించిన పథకాల్లో వీరి పేర్లు ఉండకూడదు. అంతేకాదు... చదువు, వైద్యం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలేవీ లభించవు. దీంతో ఇప్పటికే ఆయా పథకాలు పొందుతున్నవారిలో గందరగోళం మొదలైంది.ఈ నిబంధనలపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ సెప్టెంబర్ 21న సంతకం చేసినట్టు వెబ్‌సైట్లో ఉంది. ఈ నిబంధనలపై అభ్యంతరాలను తెలిపేందుకు 60 రోజుల సమయం ఉంది.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, ఇకపై కూడా ప్రభుత్వ పథకాలు అవసరం లేదని, సొంతగానే నిలదొక్కుకొని అమెరికాలో స్థిరపడతామని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ముందుకు కదులుతుంది. లేకపోతే గ్రీన్ కార్డు ఆశలు గల్లంతే. ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటే నిషేధం విధించడం ఖాయం.


డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వలసదారుల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాముల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డు విధానాన్ని టార్గెట్ చేశారు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది అక్కడి టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులే. గత ఏప్రిల్ లెక్కల ప్రకారం 632,219 మంది భారతీయులు, వారి కుటుంబ సభ్యులు గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అందులో ప్రాథమిక భారతీయ దరఖాస్తు దారులు 306,400 మంది కాగా, వారి భార్యాపిల్లల సంఖ్య 325,819 మంది. ఇప్పుడు వీరందరి భవిష్యత్తు అయోమయంలో ఉన్నట్టే.

ఇవి కూడా చదవండి:

'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

మీ జియో టీవీలో ఇండియా మ్యాచ్‌లు చూడొచ్చు!కార్డ్ పేమెంట్స్: తీసుకోవాల్సిన 30 జాగ్రత్తలు!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?
First published: September 24, 2018, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading