హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

SRILANKA BLASTS : తప్పులో కాలేసిన ట్రంప్.. 13కోట్ల మందికి సంతాపం అని ట్వీట్

SRILANKA BLASTS : తప్పులో కాలేసిన ట్రంప్.. 13కోట్ల మందికి సంతాపం అని ట్వీట్

శ్రీలంక మృతులకు సంతాపం తెలియజేస్తూ ట్రంప్ చేసిన ట్వీట్

శ్రీలంక మృతులకు సంతాపం తెలియజేస్తూ ట్రంప్ చేసిన ట్వీట్

SRILANKA BLASTS : నిజానికి శ్రీలంక మొత్తం జనాభాయే 21.4 మిలియన్లు. అలాంటిది 138 మిలియన్ల మందికి సంతాపం అంటూ ట్రంప్ బ్లండర్ ట్వీట్ చేశారు. అయితే తప్పును గుర్తించాక ఆ ట్వీట్‌ను తన హ్యాండిల్ నుంచి తొలగించేశారు.

ఏదైనా షాకింగ్ విషయంపై స్పందించేటప్పుడు.. తొందరపాటులో తప్పులు దొర్లడం సహజం. అయితే ఇది సోషల్ మీడియా కాలం కదా.. ఏ చిన్న తప్పు దొర్లినా నెటిజెన్స్ ఆడేసుకుంటారు. తాజాగా శ్రీలంక పేలుళ్లపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తొందరపాటులో తప్పులో కాలేశారు. శ్రీలంక పేలుళ్లలో మృతి చెందినవారికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన ట్రంప్.. మృతుల సంఖ్యను తప్పుగా పేర్కొన్నారు. అక్కడ చనిపోయింది 207 మంది అయితే.. 138 మిలియన్ల(13.8కోట్లు) మంది మృతులకు సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి శ్రీలంక మొత్తం జనాభాయే 21.4 మిలియన్లు. అలాంటిది 138 మిలియన్ల మందికి సంతాపం అంటూ ట్రంప్ బ్లండర్ ట్వీట్ చేశారు. అయితే తప్పును గుర్తించాక ఆ ట్వీట్‌ను తన హ్యాండిల్ నుంచి తొలగించేశారు. అయితే అప్పటికే 30 నిమిషాలు గడవడంతో దాదాపు 2000సార్లు అది రీట్వీట్ అయింది. 9వేల మంది నెటిజెన్స్ దాన్ని లైక్ చేశారు.

శ్రీలంక చర్చిలు, హోటళ్లలో జరిగిన మారణహోమంలో 138 మిలియన్ల మంది చనిపోవడం, 600 పైచిలుకు మంది గాయపడటం పట్ల అమెరికా హృదయ విదారక సంతాపం తెలియజేస్తోంది. ఈ క్లిష్ట తరుణంలో లంకకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్దంగా ఉన్నాం.
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

First published:

Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack, Terrorism

ఉత్తమ కథలు